NTV Telugu Site icon

Vikarabad Accident: వికారాబాద్‌ ఘటన.. మృతులకు ఎక్స్‌ గ్రేషియా ప్రకటించాలని డిమాండ్‌

Vikarabad Accident

Vikarabad Accident

Vikarabad Accident: వికారాబాద్ జిల్లా ధారూర్ మండ‌లంలో విషాదం చోటుచేసుకుంది. కేరెల్లి బాచారం వంతెన వద్ద ఆటో-లారీ ఢీకొన్ని ఘ‌ట‌న‌లో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనపై మాజీ మంత్రి డాక్టర్ ఏ. చంద్రశేఖర్ స్పందించారు. వికారాబాద్ పట్టణంలోని ఎన్టీఆర్ చౌరస్తాలో మృతుల కుటుంబాలతో కలిసి రోడ్డుపై నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల కు సరైన రోడ్లు లేకపోవడం వల్లనే ఇలాంటి దుర్ఘటనలు జరుగుతున్నాయని మండిపడ్డారు. గిరిజన తండాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం లేకపోవడంతో పేద ప్రజలు ప్రైవేటు వాహనాల్లో ప్రయాణం చేసి ఉండడంతోనే ఇలాంటి దుర్ఘటనలు జరుగుతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా ప్రతి పల్లెకు బస్సు సౌకర్యం కల్పించాలని వారు డిమాండ్ చేశారు. ఆస్పత్రిలో ఉన్న వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం వెంటనే 25 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించాలని, క్షతగాత్రులకు ప్రభుత్వం మెరుగైన వైద్యం అందించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పాండు గౌడ్, జిల్లా ఉపాధ్యక్షులు రాఘవన్ నాయక్, ఎస్ సి మోర్చా జిల్లా అధ్యక్షులు నవీన్ కుమార్, వికారాబాద్ పట్టణ ఇంచార్జి శివప్రసాద్, మాజీ కౌన్సిలర్ సురేష్, రమేష్ పాల్గొన్నారు.

Read also: Australia: ఇండియన్ వ్యక్తిపై రూ.5 కోట్ల రివార్డ్ ప్రకటించిన ఆస్ట్రేలియా.. ఎందుకో తెలుసా..?

ఇవాళ ఉదయం కేరెల్లి బాచారం వంతెన వద్ద ఆటో-లారీ ఢీకొన్ని ఘ‌ట‌న‌లో అక్కడిక్కడే ముగ్గురు మృతి చెంద‌గా, ఏడుగురు గాయపడ్డారు. క్షతగాత్రులను వెంట‌నే స్థానికులు గాయ‌ప‌డిన వారిని ఆసుపత్రికి త‌ర‌లించారు.. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మ‌రో వ్యక్తి మృతి చెందిన‌ట్లు వైద్యులు తెలిపారు. ఇక, మ‌రి కొంత మంది ప‌రిస్థితి విష‌మంగా ఉంద‌ని వారిని మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలించారు. బాధితులు అంతా పెద్దేముల్‌ మండలం మదనంతాపూర్‌ వాసులుగా పోలీసులు తెలిపారు. రోజూ కూలీ పనుల కోసం వికారాబాద్‌ వెళ్తుండగా ప్రమాదం జరిగింది. అయితే.. ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Kantara : ‘కాంతార’ చూసిన కేంద్రమంత్రి.. రిప్లై ఏమిచ్చారంటే..