Wedding celebrations are a tragedy in a family: పెళ్లి వేడుకల్లో విషాదం చోటుచేసుకుంది. భాజాభజంత్రీల నడుమ కొనసాగుతున్న పెళ్లివేడుకలో ఒక్కసారిగా విషాదం నెలకొంది. పెళ్లి వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసిన లైటింగ్ కు సంబంధించి విద్యుత్ ప్రసరణ కారణంగా రెండవ తరగతి చదువుతున్న 9 ఏళ్ల బాలుడు విద్యుత్ షాక్ కు గురై మృతి చెందిన ఘటన ఖమ్మం జిల్లా లో చోటు చేసుకుంది. ఖమ్మం జిల్లా కల్లూరు మండల కేంద్రంలోని శాంతినగర్ కాలనీలో కొత్తపల్లి శ్రీను సుజాత దంపతుల కుమారుడు రానా హుస్సేన్ అనే ఏడేళ్ల బాలుడు విద్యుత్ షాక్ కు గురై మృతి చెందాడు. కాలనీలో వీరి పక్క ఇంట్లో వివాహ రిసెప్షన్ జరుగుతుంది. ఈ క్రమంలో ఇళ్ల మధ్య సరిహద్దుగా ఏర్పాటు చేసిన ఇనుప రేకుల సమీపంలో విద్యుత్ లైట్లు అమర్చారు.
ఈ లైట్లకు సంబంధించిన ఎర్త్ వైర్ రేకులకు తగిలి వాటికి విద్యుత్ ప్రసారమైంది. ఈ సమయంలో బాలుడు హుస్సేన్ రేకులను పట్టుకోవడంతో విద్యుత్ ఘాతానికి గురయ్యాడు. గమనించిన కుటుంబ సభ్యులు బాలుడిని స్థానిక ఓప్రైవేటు వైద్యశాలకు తరలించగా పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం నిమిత్తం ఖమ్మం తరలిస్తుండగా.. మార్గమధ్యలో మృతి చెందారు. అల్లారు ముద్దుగా పెంచుకున్న తమ బిడ్డ విద్యుత్ షాక్ కు గురై మృతి చెందడంతో రానా హుస్సేన్ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు.పెళ్లి వేడుకల కారణంగా తొమ్మిదేళ్ల బాలుడు ప్రాణాలు కోల్పోవడంతో శాంతినగర్ కాలనీలో విషాదం నెలకొంది.
Loan Apps Harassments: లోన్ యాప్ వేధింపులు.. మరో యువకుడు బలి
