Tragedy in Banjara Hills: హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ పారామౌంట్ కాలనీలో విషాదం చోటుచేసుకున్నది. ఇంట్లోని నీటి సంపును శుభ్రం చేసేందుకు ఇద్దరు అన్నతమ్ముల్లు రాజాక్, ఆనస్, ఒకరు స్నేహితుడు రిజ్వాన్ వెళ్లారు. నీటి సంపులు రాజాక్ దిగుతానని చెప్పడంతో సరే అని అతనికి నీటి సంపులో దింపారు. రాజాక్ దిగి క్లీనింగ్ చేస్తుందడా ఒక్కసారిగా కరెంట్ షాక్ తగిలింది. గట్టిగా కేకలు వేయడంతో బయట వున్న ఆనస్, రిజ్వాన్, రజాక్ ను కాపేడేందుకు అందలో దిగారు. అంతే వారికి కూడా కరెంట్ షాక్ తగలడంతో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. వారి కేకలు విన్న కుటుంబసభ్యులు హుటాహుటిన నీటి సంపువద్దకు పరుగులు పెట్టారు. అయితే అప్పటికే ముగ్గురు మృతి చెందారు. ఒకే కుటుంబంలోని ఇద్దరు అన్నతమ్ములు, ఒక స్నేహితుడు మృతి చెందడంతో విషాదఛాయలు అలుముకున్నాయి.
నీటి సంపు శుభ్రం చేసి వస్తామని వెళ్లిన కొడుకులుతమ కల్లముందే విగత జీవిగా పడివుండటంతో తల్లిదండ్రులు తల్లడిల్లారు. కొడుకులను పట్టుకుని గుండెలు పగిలేలా రోదిస్తున్నారు. స్నేహితున్ని కాపాడేందుకు వెళ్లిన రజాక్ కూడా మృతి చెందడం పై రజాక్ కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమితం దవాఖానకు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. అసలు నీటిసంపులో కరెంట్ షాక్ ఎలా తగిలింది? నీటి సంపువద్ద కరెంట్ వైర్లు వున్నా సుంపును ఎలా కట్టారు? అక్కడ వెళ్లి ముగ్గరు యువకులకు ఆవైర్ కనిపించలేదా? అనే కోణంలో ఆరా తీస్తున్నారు.
పారామౌంట్ కాలనీ విద్యుత్ ఘాతంలో ముగ్గురు యువకులు మృతి వారిని కాపాడేందుకు ప్రయత్నించామని ఇంటి వాట్చ్ మెన్ రాజయ్య తెలిపాడు. కరెంట్ షాక్ విద్యుత్ గాతంతో ముగ్గురు యువకుల మృతి చెందారని, రంజాన్ పండుగ సమీపిస్తోంది వీరికి ఇలా జరగడం బాధాకరమన్నారు. నిన్న రాత్రి 11 గంటలకు ఘటన జరిగిందని తెలిపారు. మృతుడు రుజ్వాన్ తల్లి అరుపులు వినిపించయి వెంటనే కిందికి వెళ్ళామని తెలిపాడు. అప్పటికే నీటి సంప్ లో రీజ్వాన్ చనిపోయాడని అన్నారు. రిజ్వాన్ కాపాడేందుకు వారి తమ్ముడు తన స్నేహితుడు నీటిలోకి దిగారని వారు కూడా చనిపోయారని పేర్కొన్నాడు. నీటి సంపులో మోటర్ కరెంట్ షాక్ తగిలడంతో అక్కడే ముగ్గురు కుప్పకూలి పోయారని తెలిపారు.
Fire accident karepalli: క్లూస్ టీం అదుపులో చీమలపాడు.. ఆధారాలు సేకరిస్తున్న సిబ్బంది
