Site icon NTV Telugu

Pilloniguda vagu: రంగారెడ్డి జిల్లా శంషాబాద్ లో విషాదం.. బైక్ సహా వాగులో పడ్డ వ్యక్తి..

Pilloniguda Vagu

Pilloniguda Vagu

రంగారెడ్డి జిల్లా శంషాబాద్ లో విషాదం చోటుచేసుకుంది. వాగు మరమత్తులు ఆగిపోవడంతో బైక్ పై వస్తున్న వ్యక్తి అదుపుతప్పి బైక్ తో సహా వాగులో పడి ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ విషాద సంఘటన రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం పిల్లోనీగుడా వాగులో చోటు చేసుకుంది. స్థానికులు అందించిన వివరాల ప్రకారం….కొత్తూరు మండలం మద్దూరు రాంసింగ్ తాండాకు చెందిన దేజ్యాగ అనే వ్యక్తి పాలమాకుల వెళ్లి తిరిగి వస్తుండగా పిల్లోనీగుడా వాగు వద్ద బైక్ అదుపుతప్పి వాగులో పడిపోయింది. అయితే ఉదయం మృతదేహం నీటిపై తేలడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న శంషాబాద్ పోలీసులు మృతదేహాన్ని వెలికి తీసి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.

వర్షాకాలం వాగు మరమత్తులు సగం వరకే చేసి ఏలాంటి సూచిక బోర్డులు పెట్టకపోవడంతొ ప్రమాదం జరిగిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. రెండు మూడు గ్రామాలకు వెళ్ళాలంటే ఇదే మార్గం కాబట్టి సూచిక భోర్డులు పెట్టి ఉంటే ప్రమాదాలు జరిగేవి కావనీ మరమత్తులు సకాలంలో చేయకపోవడం మరో నిర్లక్ష్యం అని స్థానికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
Pawan Kalyan : అంబేద్కర్‌ నా హీరో.. ఒక మార్పు కోసం నేను ప్రయత్నిస్తున్నాను

Exit mobile version