Holly in tragedy: హొలీ వేడుకల్లో విషాదం.. నదిలో నలుగురు గల్లంతు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Holly in tragedy: దేశవ్యాప్తంగా హోలీ వేడుకలు ప్రజలు జరుపుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆనందాల హోలు పలుచోట్లు ప్రమాదాలకు దారితీసింది. ఆనందంగా గడపాల్సిన కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. హోలీ వేడుకలు జరుపుకుని ఈతకు వెళ్లిన పలువురు యువకులు గల్లంతు కాగా.. మరోచోట హోలీ వేడుకలకు వెళుతున్న భార్యభర్తలు ప్రమాదానికి గురై అక్కడికక్కడే మృతి చెందారు. ఇక ఇంకోచోట వాటర్ ట్యాంక్ పగలి యువతి పై పడటంతో ఆ యువతి అక్కడికక్కడే మృతి చెందిన ఘటనలు వారి కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి.
Read also: Goa: గోవాలో తొలిసారి ఎంపీ అభ్యర్థిగా మహిళాను రంగంలోకి దించిన బీజేపీ
Also Read
- Ebola Virus : గాంధీ ఆసుపత్రిలో సుడాన్ వ్యక్తికి ‘ఎబోలా’ నెగిటివ్.. ఊపిరి పీల్చుకున్న వైద్యులు
- Indiramma House: మోడ్రన్ టెక్నాలజీ వచ్చేసింది.. 12 రోజుల్లోనే ఇందిరమ్మ ఇంటి నిర్మాణం..
- CM Revanth Reddy : కేసీఆర్ చర్చకు అసెంబ్లీకి రా.. పాలమూరును బొందపెట్టింది నువ్వే
- Spa Center Raids : స్పా సెంటర్ల ముసుగులో గలీజ్ దందా.. 113 చోట్ల పోలీసుల మెగా రైడ్స్!
కొమరంభీం జిల్లా కౌటాల మండలం తాటి పల్లి వార్ధా నదిలో స్నానానికి వెళ్లి యువకులు గల్లంతైన ఘటన తీరని విషాదాన్ని నింపింది. హోలీ వేడుకలు జరుపుకున్న యువకులు ఆనందంలో స్నానం కోసం వార్ధా నదికి వెళ్లారు. అయితే వెళ్లిన యువకుల జాడ తెలియరాలేదు. ఒడ్డున వున్న మరికొంత మంది గుర్తించి అక్కడే వున్న పోలీసులకు సమాచారం ఇచ్చారు. నలుగురు గల్లంతు అయినట్లు స్ధానికులు పోలీసులకు తెలిపారు. వెంటనే ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు సేకరిస్తున్న పోలీసులు. నలుగురు గల్లంతు అయిన యువకులు సంతోష్, ప్రవీణ్, కమలాకర్, సాయిగా గుర్తించారు. వీరు కౌటాల మండలం నదిమబాద్ గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. ఆ నలుగురు యువకుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
Read also: London : లండన్ లో భారతీయ విద్యార్థిని మృతి
మరోవైపు సికింద్రాబాద్ లో హొలీ పండుగ రోజున విషాదం చోటుచేసుకుంది. హోలికి బంధువుల ఇంటికి వెళుతున్న భార్య భర్తలు రోడ్ ప్రమాదంలో మృతి చెందిన ఘటన తీరని విషాదాన్ని నింపింది. సూచిత్ర నుంచి ముషీరాబాద్ వెళ్తుండగా ద్వి చక్ర వాహనంను లారీ ఢీ కొట్టింది. రోడ్ పై వైర్లు తెగి పడి ఉండడంతో పక్కకు వాహనం నిలిపివేసి వాహనదారులు వేచి ఉండగా.. వెనుక నుంచి వచ్చిన లారీ రెండు వాహనాలను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో భార్య భర్త లు ఆకాష్, నందిని అక్కడికక్కడే మృతి చెందారు. స్థానిక సమాచారం పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. లారీ డ్రైవన్ ను అదుపులో తీసుకున్నారు.
Read also: Mudragada Padmanabham: చంద్రబాబు, పవన్ కల్యాణే కారణం..! ఇద్దరినీ వదలని ముద్రగడ..
మేడ్చల్ జిల్లా కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. బండ్లగుడా శాంతినీకేతన్ ప్రైవేట్ స్కూల్ లో 8 వతరగతి చదువుతున్న ముగ్గురు విద్యార్థులు ఈతకు వెళ్లారు. అయితే ముగ్గురిలో ఒకరైన నరేష్ కుమార్(12) ఈత రాకపోవడంతో చెరువులో మునిగిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు నిన్నటి నుండి నరేష్ ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు. అయితే నేడు నరేష్ మృత దేహం ఆచూకీ లభించడంతో పడవల సహాయంతో మృతదేహాన్ని వెలికి తీసి కేసు నమోదు చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు పోలీసులు.
Read also: OTT Movies : ఈ వారం ఓటీటీలోకి రాబోతున్న సినిమాలు, వెబ్ సిరీస్ లు ఇవే..
నారాయణపేటలో హోలీ వేడుకల్లో విషాదం చోటుచేసుకుంది. పట్టణంలోని గోపాల్పేట వీధిలోని మంచినీటి ట్యాంకు వద్ద చిన్నారులు హోలీ ఆడుకుంటుండగా ఒక్కసారిగా కుప్పకూలింది. దీంతో ట్యాంక్ సిమెంట్ ముక్కలు వారిపై పడి తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే వచ్చి చిన్నారులను జిల్లా ఆస్పత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ లక్ష్మీ ప్రణీత(12) అనే చిన్నారి మృతి చెందింది. ప్రణీత చేయి విరగడంతో హరిప్రియ కాలు విరిగింది. ఇంతలో ప్రమాదానికి కారణమైన ట్యాంకును స్థానికులు పూర్తిగా తొలగించారు. అయితే సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.
Vemulawada: రాజన్న ఆలయానికి పోటెత్తిన భక్తులు.. కోడె మొక్కులతో ఆలయ ప్రాంగణం
తాజావార్తలు
-
ISS Air Leak: అంతరిక్షంలో ఆందోళన.. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో గాలి లీక్ కలకలం
-
Eng vs NZ: మొదటి రోజు 16, రెండో రోజు 17 వికెట్లు.. బ్యాటర్స్కు ముచ్చెమటలు పట్టిస్తున్న బౌలర్లు.!
-
Iran-US Tensions: మరోసారి భగ్గుమన్న పశ్చిమాసియా.. ఇరాన్ డ్రోన్లను కూల్చేసిన అమెరికా, రాడార్ కేంద్రాలపై దాడులు
-
నేడు AFG vs IND ఏకైక టెస్ట్ మ్యాచ్.. టీమిండియా ప్లేయింగ్ XI ఇలా.!
-
Niger: సహారా ఎడారిలో ఘోర విషాదం.. నీరు దొరక్క తీవ్ర దాహంతో 49 మంది నరకయాతన అనుభవిస్తూ మృతి!
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!