NTV Telugu Site icon

Tragedy: భార్య భర్తపై పడిన భారీ వృక్షం.. ఆ తరువాత..

Bollaram Accident

Bollaram Accident

Tragedy: విధిని ఎవ్వరూ మార్చలేరు.. ఎప్పటికీ చెరిపేయలేరు.. ఈ ప్రమాదం నుంచి తప్పించుకున్నానని ఊపిరి పీల్చుకునేలోపే మరో ప్రమాదం పొంచిఉంటుంది. అందుకే ఈ ప్రపంచంలో ఎవరూ గ్యారెంటీ కార్డు రాయలేదనడానికి మనం రోజూ ఓ ఉదాహరణ చూస్తూనే ఉంటాం. ఎక్కడో ఒకచోట.. మనిషి ప్రతి క్షణం మృత్యువుతో పోరాడుతున్నాడు. అనారోగ్యం బాగోలేక ఆసుపత్రికి వస్తే.. అక్కడ కూడా ప్రయాదం జరుగుతుందని ఎవరు ఊహించలేరు. అప్పటి వరకు తనతో వున్న మనిషి దూరమవుతారని గ్రహించలేరు. అయితే.. ఆరోగ్యం బాగోలేదని ఆసుపత్రికి వస్తే మరో ప్రమాదం జరిగి చనిపోతుందని ఎవరు అనుకుంటారు.. చెట్టు కొమ్మ విరిగి మీపై పడుతుందని కలలోనైనా ఊహించారా? ఈ వీడియో చూస్తే అయ్యె అనక మానరు.

Read also: Travelers to Goa: గోవా వెళ్లాల్సిన ప్రయాణికులు రాత్రంతా పోలీస్ స్టేషన్ ముందు..?

అసలేం జరిగింది..

హైదరబాద్ లోని బొల్లారం కంటోన్మెంట్ ఆసుపత్రిలో ప్రమాదం చోటుచేసుకుంది. కంటోన్మెంట్ ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం వచ్చిన దంపతులపై ఆస్పత్రి ఆవరణలో ఉన్న భారీ వృక్షం విరిగి పడడంతో భర్త రవీందర్ అక్కడికక్కడే మృతి చెందగా అతని భార్య సరళ దేవికి తీవ్ర గాయాలయ్యాయి. ఆసుపత్రికి వస్తున్న క్రమంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో సరళ దేవికి సైతం తీవ్ర గాయాలు కావడంతో హుటాహుటిగా మెరుగైన చికిత్స కోసం అంబులెన్స్ లో గాంధీ ఆస్పత్రికి తరలించారు. సరళ దేవి ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్నట్లు గుర్తించారు.

Read also: KTR Tweet: ఎద్దేడ్సిన యవుసం.. రైతేడ్చిన రాజ్యం నిలబడదు.. కేటీఆర్ ట్వీట్ వైరల్

ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఒక్కసారితో ఈ ఘటన మూలంగా ఆసుపత్రికి వచ్చిన వారంతా ఆందోళన గురయ్యారు. ఆసుపత్రి లోపలికి సరళ దంపతులకంటే ముందే ఒక బైక్ అక్కడి నుంచి వెళ్లింది.. అయితే వీరు తరువాత అటు నుంచే ప్రయాణించారు. వీరిపై విధి వక్రీకరించింది. ఒక్కసారిగా భారీ వృక్షం వీరిద్దరపై పడటంతో సరళ భర్త అక్కడికక్కడే మృతి చెందారు. సరళకు తీవ్ర గాయాలతో స్పృహ కోల్పోయింది. స్థానిక సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు సరళను హుటాహుటిన గాంధీ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Telangana DGP Fake DP: తెలంగాణ డీజీపీ రవి గుప్తా వాట్సప్ డీపీతో సైబర్‌ ఫ్రాడ్‌..