NTV Telugu Site icon

New Traffic Rules: జూన్ 1 నుంచి మారనున్న ట్రాఫిక్ రూల్స్‌.. వారికి రూ.25 వేల జరిమానా..

New Traffic Rules

New Traffic Rules

New Traffic Rules: రోడ్డు ప్రమాదాల నివారణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ప్రమాదాలు ఆగడం లేదు. మద్యం మత్తు, అతివేగం, అజాగ్రత్తగా వాహనాలు నడపడం.. రోడ్డు ప్రమాదాలకు అనేక కారణాలు. తల్లిదండ్రులు మైనర్లకు వాహనాలు ఇవ్వడం వల్ల కూడా ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. జూన్ 1 నుంచి ట్రాఫిక్ నిబంధనలు కఠినతరం చేస్తున్నారు పోలీసు బాసులు. మారనున్న ట్రాఫిక్ నిబంధనల ప్రకారం నిర్లక్ష్యంగా వ్యవహరించే డ్రైవర్ల జేబులకు చిల్లులు పడనున్నాయి. అతివేగంతో పట్టుబడితే రూ. 1000 నుంచి రూ.2000, లైసెన్స్ లేకుండా వాహనం నడిపితే రూ.500 జరిమానా. మైనర్లకు వాహనం నడిపితే రూ.25 వేలు జరిమానా, 25 ఏళ్లు వచ్చే వరకు డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోకుండా నిషేధం విధించనున్నారు.

Read also: Mallu Bhatti Vikramarka: ఒడిశాలో భట్టి విక్రమార్క.. రాహుల్‌ గాంధీతో కలిసి ప్రచారం..

మరోవైపు ప్రస్తుతం డ్రైవింగ్ లైసెన్స్ కావాలంటే ఆర్టీఏ కార్యాలయానికి వెళ్లాల్సిందే. అక్కడ స్లాట్ బుక్ చేసుకొని కొన్ని గంటలపాటు వేచి ఉండి.. డ్రైవింగ్ టెస్ట్ పాస్ అయితే లైసెన్స్ జారీ చేస్తారు. అయితే జూన్ 1 నుంచి ఆర్టీఓ కార్యాలయానికి వెళ్లాల్సిన అవసరం లేదు. డ్రైవింగ్ స్కూల్‌కు వెళ్లి డ్రైవింగ్ లైసెన్స్ పొందండి. కొత్త నిబంధన ప్రకారం ఆర్టీఓ కార్యాలయానికి వెళ్లి పరీక్ష రాయాల్సిన అవసరం లేదు. అధీకృత ప్రైవేట్ డ్రైవింగ్ ఇన్‌స్టిట్యూట్ నుండి డ్రైవింగ్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించండి. ఎంపిక చేసిన ప్రైవేట్ డ్రైవింగ్ పాఠశాలలకు ప్రభుత్వం సర్టిఫికెట్లు మంజూరు చేస్తుంది, ఈ డ్రైవింగ్ పరీక్షలను నిర్వహించడానికి వారికి అధికారం ఇస్తుంది. అక్కడికి వెళ్లి లైసెన్స్ తీసుకోవచ్చు.
Prajwal Revanna : నేడు భారత్‌కు ప్రజ్వల్ రేవణ్ణ.. బెంగళూరు ఎయిర్ పోర్టులోనే అరెస్ట్ చేసే ఛాన్స్