Site icon NTV Telugu

Traffic Restrictions: నేడు, రేపు ట్రాఫిక్‌ ఆంక్షలు.. ఆ రూట్లు ఇవే..

Ujjaini Mahakali Tafik Retriction

Ujjaini Mahakali Tafik Retriction

Traffic Restrictions: సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర సందర్భంగా హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో అధికారులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో ఆది, సోమవారాల్లో ఈ ఆంక్షలు అమలులో ఉంటాయని తెలిపారు. బోనాల పండుగ సందర్భంగా వచ్చే భక్తులతో ఆలయం దగ్గర రద్దీ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించి వాహనాలను దారి మళ్లించనున్నారు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌కు వచ్చేవారు ముందుగానే బయలుదేరాలని సూచించారు.

ఆ రూట్లు ఇవే..

* కర్బలా మైదాన్, రాణిగంజ్, రాంగోపాల్ పేట్ ఓల్డ్ PS, ప్యారడైజ్, CTO, ప్లాజా, SBI క్రాస్ రోడ్, YMCA, సెయింట్ జాన్స్ రోటరీ, సంగీత్ క్రాస్ రోడ్, పాట్నీ క్రాస్ రోడ్, పార్క్ లైన్, బాటా, ఘస్మండి క్రాస్ రోడ్, రసూర్ పురా రోడ్లు, జంక్షన్ల వైపు వాహనదారులు రావద్దని సూచించారు.

* టబాకో బజార్, హిట్ స్ట్రీట్ నుండి మహంకాళి ఆలయం వైపు వెళ్లే రహదారులపై వాహనాల రాకపోకలు నిలిపివేశారు.

* బాట క్రాస్‌ రోడ్డు నుంచి పాత రాంగోపాల్‌ పేట పీఎస్‌, సికింద్రాబాద్‌, సుబాష్‌ రోడ్డు వరకు వాహనాల రాకపోకలు బంద్ చేశారు.

* కర్బలా మైదాన్ నుండి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు వచ్చే సాధారణ ట్రాఫిక్, ఆర్టీసీ బస్సులను మినిస్టర్ రోడ్-రసూల్‌పురా క్రాస్ రోడ్-PNT ఫ్లైఓవర్-CTO-SBI క్రాస్ రోడ్-YMCA క్రాస్ రోడ్-సెయింట్ జాన్స్ రోటరీ-సంగీత్-గోపాలపురం లేన్‌లో రాణిగంజ్ క్రాస్ వద్ద మళ్లించారు.

Read also: Ujjaini Bonalu: ఘనంగా మహంకాళి బోనాలు.. అమ్మవారికి బోనం సమర్పించిన తలసాని

* రైల్వేస్టేషన్‌ నుంచి ట్యాంక్‌బండ్‌ వైపు తిరిగే ఆర్టీసీ బస్సులను చిలకలగూడ ఎక్స్‌ రోడ్డు, గాంధీ ఆస్పత్రి-ముషీరాబాద్‌ ఎక్స్‌ రోడ్డు-కవాడిగూడ-మారియట్‌ హోటల్‌-ట్యాంక్‌బండ్‌ మీదుగా మళ్లించారు.

రైల్వే స్టేషన్‌ నుంచి తాడ్‌బన్‌, బేగంపేట వైపు వెళ్లే ఆర్టీసీ బస్సులను క్లాక్‌ టవర్‌, ప్యాట్నీ క్రాస్‌ రోడ్‌, ఎస్‌బీఐ క్రాస్‌ రోడ్డు వైపు మళ్లించారు.

* బైబిల్ హౌస్ నుంచి సికింద్రాబాద్ రైల్వేస్టేషన్, త్రిముల్గేరి వైపు వచ్చే వాహనదారులను సజ్జన్ లాల్ స్ట్రీట్, సికింద్రాబాద్ రైల్వేస్టేషన్, హిట్ స్ట్రీట్, ఘస్మండి క్రాస్ రోడ్‌లోని రాణిగంజ్ వైపు మళ్లిస్తామని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.

* ఎస్‌బీఐ క్రాస్‌ రోడ్డు నుంచి ట్యాంక్‌బండ్‌ వైపు వచ్చే వాహనాలను ప్యారడైజ్‌, మినిస్టర్‌ రోడ్‌, క్లాక్‌ టవర్‌, సంగీత్‌ క్రాస్‌ రోడ్‌, సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌, చిలకలగూడ, ముషీరాబాద్‌ క్రాస్‌ రోడ్‌, కవాడిగూడ, మ్యారియట్‌ హోటల్‌, ట్యాంక్‌బండ్‌ మీదుగా ప్యాట్నీ క్రాస్‌ వైపు మళ్లిస్తామని ట్రాఫిక్‌ పోలీసులు తెలిపారు. ప్రజలు సహకరించి రెండు రోజుల పాటు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని సూచించారు.
Honey Trap: పాకిస్తాన్ వలుపు వలలో బీఎస్ఎఫ్ ఉద్యోగి..

Exit mobile version