NTV Telugu Site icon

Hyderabad Traffic Restrictions: ఇవాళ హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ ఆంక్షలు.. ఎందుకంటే?

Hyderabad Traffic Restrictions

Hyderabad Traffic Restrictions

Hyderabad Traffic Restrictions: ఈరోజు హైదరాబాద్‌లోని ఉప్పల్‌లో భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య తొలి వన్డే మ్యాచ్ జరగనుంది. ఈ నేపథ్యంలో నగరంలోని పలు ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఉదయం 8 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఆంక్షలు కొనసాగుతాయి. సోమాజిగూడ నుంచి ఉప్పల్ రాజీవ్ గాంధీ స్టేడియం వరకు ఈ ఆంక్షలు ఉంటాయని తెలిపారు. సోమాజిగూడ, గ్రీన్ ల్యాండ్స్, బేగంపేట్, రసూల్‌పురా, సీటీఓ, ఎస్‌బీహెచ్ జంక్షన్, సెయింట్ జాన్స్ రోటరీ, సంగీత్ జంక్షన్, అల్లుగడ్డ బావి, మెట్టుగూడ జంక్షన్, తార్నాక, హబ్సిగూడ, ఎన్‌జీఆర్‌ఐ, ఉప్పల్‌లో నివసించే పౌరులు పైన పేర్కొన్న మార్గంలో కాకుండా ఇతర మార్గాల్లో వెళ్లాలని సూచించారు. అదేవిధంగా మ్యాచ్ ప్రారంభం, ముగింపు సమయంలో వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో ప్రయాణించాలని తెలిపారు.

Read also: Kamareddy Master Plan: మాస్టర్ ప్లాన్ రద్దుపై ఉత్కంఠ.. ఎమ్మెల్యేకు మెసేజ్ లు పంపిన రైతులు

ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్ దృష్ట్యా కారిడార్-3 (నాగోల్-రాయదుర్గం)లో అదనపు మెట్రో రైళ్లు అందుబాటులో ఉంటాయి. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ప్రతి 7 నిమిషాలకు ఒక రైలు బదులు 5 నిమిషాలు, సాయంత్రం 4 నుంచి రాత్రి 10 గంటల వరకు 4 నిమిషాల ఫ్రీక్వెన్సీలో సర్వీసులు నడుస్తాయి. స్టేడియం వద్ద మెట్రో స్టేషన్‌లో 10 కౌంటర్లు ఏర్పాటు చేశారు. ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరగనున్న ఈ వన్డే మ్యాచ్‌కు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు. 2500 మంది పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. స్టేడియం లోపలికి సెల్ ఫోన్లు తప్ప ఇతర వస్తువులను అనుమతించబోమని స్పష్టం చేశారు. క్రికెటర్లను మైదానంలోకి వెళ్లి అడ్డుకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Barkat Ali khan Funeral: నేడు అధికార లాంఛనాలతో చివరి నిజాం అంత్యక్రియలు