NTV Telugu Site icon

Traffic Restrictions: అల‌ర్ట్‌… రేపు న‌గ‌రంలో ప‌లు చోట్ల ట్రాఫిక్ ఆంక్షలు..

Traffic Restrictions

Traffic Restrictions

Traffic Restrictions: హైదరాబాద్ వాహనదారులకు కీలక గమనిక… రేపు నగరంలో పలు చోట్ల ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని అధికారులు తెలిపారు. రేపు (సోమవారం) ముస్లింల పవిత్ర పండుగ బక్రీద్ సందర్భంగా అధికారులు పలు ఏర్పాట్లు చేశారు. నగరంలోని ఈద్గాలు, మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించేందుకు వివిధ ఏర్పాట్లు చేయనున్నారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ ప్రార్థనలు జరిగే పరిసర ప్రాంతాల్లో వాహనాలను దారి మళ్లిస్తున్నామన్నారు. సోమవారం బక్రీద్ సందర్భంగా హైదరాబాద్‌లోని పలు చోట్ల ట్రాఫిక్ ఆంక్షలు విధించనున్నట్లు అధికారులు తెలిపారు. ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించే మీరాలం ఈద్ పరిసర ప్రాంతాల్లో వాహనాలను దారి మళ్లిస్తామని పోలీసులు వివరించారు. పాతబస్తీలోని పలు రహదారులపై రాకపోకలు నిలిపివేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

Read also: Trains Cancelled: నెల రోజులపాటు రైళ్ల సేవలు బంద్‌.. వివరాలు ఇవే..

రేపు ఉదయం 8:00 గంటల నుంచి 11:30 గంటల వరకు మీరాలం ఈద్గా ప్రాంతంలో వాహనాలను దారి మళ్లిస్తామని పేర్కొన్నారు. పురానాపూల్, కమాటిపురా మరియు కిషన్‌బాగ్ వైపు నుండి ఈద్గా ప్రార్థనల కోసం వచ్చే వారిని మాత్రమే బహదూర్‌పురా క్రాస్ రోడ్ మీదుగా ఉదయం 8:00 నుండి 11:30 వరకు అనుమతిస్తామని అధికారులు తెలిపారు. ప్రార్థనలకు వచ్చే వారికి పార్కింగ్ సౌకర్యం కోసం జూ పార్క్, మసీదు అల్హా హో అక్బర్ ముందు ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. సోమవారం (జూన్ 17) ముస్లింల పవిత్ర పండుగ బక్రీద్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు. సోమవారం పాత బస్తీలో సుమారు 1000 మంది పోలీసులను మోహరిస్తున్నట్లు వారు తెలిపారు. ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు చేయనున్న మీరాలం ఈద్ సందర్భంగా ప్రత్యేక భద్రత ఏర్పాటు చేయనున్నారు. ఇంకా, ఈ ప్రార్థనలకు 30,000 మందికి పైగా ముస్లిం సోదరులు హాజరయ్యే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.
Drinking Beer: బీర్లు తాగాడు.. లక్షాధికారి అయ్యాడు.. అదెలా?