Traffic restrictions: హైదరాబాద్‌లోని గచ్చిబౌలి నుంచి కొండాపూర్ వరకు కొత్త ఫ్లైఓవర్ నిర్మిస్తున్న నేపథ్యంలో ఈ నెల 13 నుంచి మూడు నెలల పాటు ఈ రహదారిని మూసివేస్తున్నట్లు సైబరాబాద్ ట్రాఫిక్ జాయింట్ సీపీ నారాయణనాయక్ వెల్లడించారు. దీంతో ట్రాఫిక్ మళ్లింపు చేసినట్లు సైబరాబాద్ పోలీసులు వెల్లడించారు. గచ్చిబౌలి ఓఆర్‌ఆర్ కూడలి నుంచి కొండాపూర్ వెళ్లే రహదారిని కొద్ది రోజులుగా మూసివేస్తున్నట్లు తెలిపారు. ఒక్కరోజు, రెండు రోజులు కాదు.. ఏకంగా 90 రోజులు అంటే 13.05.2023 నుంచి 10.08.2023 వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయని తెలిపారు. గచ్చిబౌలి ఓఆర్‌ఆర్ కూడలి నుంచి కొండాపూర్ వెళ్లే రహదారి వద్ద 24 గంటలూ పని జరుగుతుందని కావున వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను చూసుకోవాలని సూచించారు. ట్రాఫిక్ రద్దీని నివారించడానికి ప్రయాణికులు ప్రత్యామ్నాయ రహదారులను వినియోగించుకోవాలని తెలిపారు.
ట్రాఫిక్ మళ్లింపులు:
1. ORR నుండి హఫీజ్‌పేట వైపు వచ్చే ట్రాఫిక్ శిల్పా లేఅవుట్ ఫ్లైఓవర్ – మీనాక్షి టవర్స్ – డెలాయిట్ – AIG హాస్పిటల్ – క్యూ మార్ట్ – కొత్తగూడ ఫ్లైఓవర్ – హఫీజ్ పేట వద్ద మళ్లించబడుతుంది.
2. లింగంపల్లి నుండి కొండాపూర్ వైపు వచ్చే ట్రాఫిక్ గచ్చిబౌలి ట్రాఫిక్ PS – DLF రోడ్ – రాడిసన్ హోటల్ – కొత్తగూడ కొండాపూర్ వద్ద మళ్లించబడుతుంది.
3. విప్రో జంక్షన్ నుండి ఆల్విన్ ఎక్స్ రోడ్ వైపు వచ్చే ట్రాఫిక్ ట్రిపుల్ ఐటీ జంక్షన్ – లెఫ్ట్ టర్న్ – గచ్చిబౌలి స్టేడియం – డిఎల్ఎఫ్ రోడ్ – రాడిసన్ హోటల్ – కొత్తగూడ ఫ్లైఓవర్ – యు టర్న్ ఆల్విన్ వద్ద మళ్లించబడుతుంది.
4. టోలిచౌకి నుండి ఆల్విన్ ఎక్స్ రోడ్ వైపు వచ్చే ట్రాఫిక్ బయోడైవర్సిటీ ఫ్లైఓవర్ – మైండ్‌స్పేస్ జంక్షన్ వద్ద మళ్లించబడుతుంది. – సైబర్ టవర్స్ జంక్షన్. – ఎడమవైపు హైటెక్స్ సిగ్నల్ – కొత్తగూడ జంక్షన్ – ఆల్విన్.
5. టెలికాం నగర్ నుండి కొండాపూర్ వైపు వచ్చే ట్రాఫిక్ ఫ్లైఓవర్ కింద గచ్చిబౌలి వద్ద యు-టర్న్ వద్ద మళ్లించబడుతుంది. బస్ స్టాప్ పక్కన శిల్పా లేఅవుట్ ఫ్లైఓవర్ – మీనాక్షి టవర్స్ – డెలాయిట్ – AIG హాస్పిటల్ – క్యూ మార్ట్ – కొత్తగూడ – కొండాపూర్.
6. ఆల్విన్ ఎక్స్ రోడ్ నుండి గచ్చిబౌలి వైపు వచ్చే ట్రాఫిక్ కొత్తగూడ జంక్షన్ నుండి హైటెక్స్ రోడ్ – సైబర్ టవర్స్ మైండ్‌స్పేస్ జంక్షన్ – శిల్పా లేఅవుట్ ఫ్లైఓవర్ – గచ్చిబౌలి / ఓఆర్ఆర్ వైపు మళ్లించబడుతుంది.
7. ఆల్విన్ ఎక్స్ రోడ్ నుండి లింగంపల్లి వైపు వచ్చే ట్రాఫిక్ బొటానికల్ గార్డెన్ జంక్షన్ వద్ద మళ్లించబడుతుంది. పోలీసులు సూచించిన ట్రాఫిక్ ఆంక్షలకు వాహనదారులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
Flexi War: తణుకులో వేడెక్కిన రాజకీయం.. 12 కిలోమీటర్ల మేర పోటాపోటీగా వైసీపీ-టీడీపీ ఫ్లెక్సీలు