Hyderabad Traffic Restrictions: హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్‌లో శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు 125 అడుగుల డా.బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని సీఎం కేసీఆర్ ఆవిష్కరించనున్నారు. ఈ సందర్భంగా హుస్సేన్‌సాగర్ పరిసర ప్రాంతాల్లో మధ్యాహ్నం 1 గంట నుంచి రాత్రి 8 గంటల వరకు పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. పలు మార్గాలు మూసివేయబడంతో పాటు దారి మళ్లించబడతాయి. నెక్లెస్ రోడ్డు, ఎన్టీఆర్ మార్గ్, ఐమాక్స్ మార్గాల్లో వచ్చే ట్రాఫిక్‌ను ఇతర మార్గాల్లో మళ్లిస్తామని, ఎన్టీఆర్ గార్డెన్, ఎన్టీఆర్ ఘాట్, నెక్లెస్ రోడ్డు, లుంబినీ పార్క్‌లను మూసివేస్తున్నట్లు తెలిపారు. ట్యాంక్‌బండ్‌పై వెళ్లే ఆర్టీసీ బస్సులు ట్రాఫిక్ ఆంక్షలను దృష్టిలో ఉంచుకుని ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని అధికారులు సూచించారు.
ఖైరతాబాద్ చౌరస్తాలో వాహనదారులు ఇక్కట్లు..
ఖైరతాబాద్ చౌరస్తాలో ఉదయం 9 గంటలనుంచి ట్రాఫిక్ ఆంక్షలు మొదలయ్యాయి. ఖైరతాబాద్ చౌరస్తా వద్ద ఫ్లైఓవర్ ని పూర్తిగా మూసివేశారు అధికారులు.
మధ్యాహ్నం ఒంటిగంట నుండి ట్రాఫిక్ డైవర్షన్ ఉంటుందని ప్రకటించడంతో ప్రయాణికులు ఖైరతాబాద్ నుంచి వెళ్లేందుకు బయలు దేరారు. కానీ 9 గంటలకే ట్రాఫిక్ డైవర్షన్ చేపట్టడంతో వాహనదారుల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఖైరతాబాద్ చౌరస్తా మీద ట్యాంక్ బండ్ వైపు వెళ్లాలనుకునే వాహనాలు పోలీస్ కంట్రోల్ రూమ్ మీదుగా వెళ్లాల్సి ఉంటుందని అధికారులు తెలుపడంతో వాహనదారులు దిక్కుతోచని పరిస్థితుల్లో అక్కడు నుంచి వెళుతున్నారు. మధ్నాహ్నం నుంచి ట్రాఫిక్ మళ్లింపు ఉంటుందని తెలిపిన అధికారులు ఉదయం 9 గంటలనుంచే ట్రాపిక్ మళ్లించడం ఏంటని వాహనదారులు మండిపడుతున్నారు. ట్రాఫిక్ మళ్లింపు ఉదయం నుంచే అని ప్రకటించి ఉంటే వేరే రూట్లల్లో ప్రయాణించేవారం అంటూ మండిపడిపడుతున్నారు.
ట్రాఫిక్ మళ్లింపు..
* ఖైరాబాద్ చౌరస్తాలోని పీవీ విగ్రహం నుంచి నెక్లెస్ రోటరీ, ఎన్టీఆర్ మార్గ్, తెలుగు తట్లీ జంక్షన్ వైపు వచ్చే వాహనాలకు అనుమతి లేదు.
* ఖైరతాబాద్, పంజాగుట్ట, సోమాజిగూడ నుంచి నెక్లెస్ రోటరీ వైపు వచ్చే వాహనాలు ఖైరతాబాద్ చౌరస్తా నుంచి సదన్, నిరంకారి వైపు వెళ్లాలి.
* ట్యాంక్‌బండ్ నుండి PVNR మార్గ్ వరకు వాహనాలను అనుమతించరు. ఈ వాహనాలు సోనాబి మాస్క్ నుండి రాణిగంజ్ మరియు కర్బలా వైపు మళ్లించబడతాయి.
* నల్లగుట్ట నుంచి రసూల్‌పురా, మినిస్టర్ రోడ్డు నుంచి నెక్లెస్ రోటరీ వైపు వచ్చే వాహనాలకు అనుమతి లేదు. ఈ వాహనాలు నల్లగుట్ట జంక్షన్ నుంచి రాణిగంజ్ వైపు వెళ్లాలి.
* ఇక్బాల్ మినార్ జంక్షన్ నుండి ట్యాంక్‌బండ్, రాణిగంజ్ మరియు లిబర్టీ వైపు వాహనాలను అనుమతించరు. తెలుగుతల్లి యిప్లెఓవర్ నుంచి కట్టమైసమ్మ జంక్షన్, లోయర్ ట్యాంక్‌బండ్ మీదుగా వెళ్లాలి.
* ట్యాంక్‌బండ్ నుంచి తెలుగు తత్లీ జంక్షన్ మీదుగా ఎన్టీఆర్ మార్గ్ వైపు వెళ్లే వాహనాలకు అనుమతి లేదు. ఈ వాహనాలు ఇక్బాల్ మినార్ జంక్షన్ వైపు వెళ్లాలి.
* బిర్క్ భవన్ నుంచి ఎన్టీఆర్ మార్గ్ వెళ్లే వాహనాలు తెలుగుతల్లి జంక్షన్ నుంచి ఇక్బాల్ మినార్ జంక్షన్ వైపు వెళ్లాలి.
* ఇక్బాల్ మినార్ జంక్షన్ నుండి మింట్ కాంపౌండ్ లేన్ వరకు వాహనాలను అనుమతించరు.
* ఖైరతాబాద్ బడా గణేష్ లేన్ నుండి ప్రింటింగ్ ప్రెస్ జంక్షన్ మరియు నెక్లెస్ రోటరీ వైపు అనుమతి లేదు. ఈ వాహనాలు రాజ్‌దూత్ లేన్ నుండి వెళ్లాలి.
Dhanadhanyo Auditorium: శంఖు ఆకారంలో ధన ధాన్య ఆడిటోరియం నిర్మాణం