Site icon NTV Telugu

BJP National Executive Meeting: రేపు పరేడ్ గ్రౌండ్ లో మోదీ సభ.. ట్రాఫిక్ మళ్లింపు

Modi Meting

Modi Meting

రేపు సికింద్రాబాద్ లోని పరేడ్ గ్రౌండ్ లో జరుగునున్న భారతీయ జనతా పార్టీ బహిరంగ సభకు సంబంధించి ట్రాఫిక్ పోలీసులు ఆంక్షలు విధించారు. వారు మాట్లాడుతూ.. HICC మాదాపూర్ – జూబ్లీహిల్స్ చెక్పోస్ట్ – రాజ్ భవన్ – పంజాగుట్ట – బేగంపేట్ ఎయిర్పోర్ట్ – పరేడ్ గ్రౌండ్ మరియు పరేడ్ గ్రౌండ్ చుట్టుపక్కల రోడ్లలో ప్రయాణించడం నిషేధించారు. టివోలి X రోడ్ నుండి ప్లాజా X రోడ్ మధ్య రహదారి మూసివేయబడుతుందని తెలిపారు. సికింద్రాబాద్ పరిధిలోని పలు జంక్షన్ లలో తీవ్రమైన ట్రాఫిక్ అంతరాయం ఉండవచ్చని ఆ పరిసరాల్లో రాకూడదని సూచించారు. MG రోడ్, RP రోడ్ మరియు SD రోడ్లలో మరియు సికింద్రాబాద్ లోని పరేడ్ గ్రౌండ్ నుండి 3 కిలోమీటర్ల పరిధిలోని అన్ని జంక్షన్ల రోడ్లలో ప్రయాణాలను నివారించాలని ప్రజలకు సూచించారు.

ట్రాఫిక్ మళ్లింపులు:

పంజాగుట్ట వైపు నుండి ఖైరతాబాద్, ఆర్. టి. సి. X రోడ్, మీదుగా చిలకలగూడ నుండి ప్లేట్ ఫారం 10 ద్వారా ప్రవేశం వుంటుంది. ఉప్పల్ వైపు నుండి నారాయణగూడ, ఆర్ టి సి X రోడ్, మీదుగా చిలకలగూడ నుండి ప్లేట్ ఫారం 10 ద్వారా రావచ్చు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వెళ్ళు వారు ప్యాటినీ, పారడైస్, బేగంపేట్ దారులను రాకూడదని తెలిపారు. కరీంనగర్, నిజామాబాదు వైపు నుండి వచ్చే వాహనాలు ఔటర్ రింగ్ రోడ్ నుండి వేరే మార్గాల ద్వారా హైదరాబాద్ నగరం లోకి ప్రవేశించాలని సూచించారు. ఇక ఉప్పల్ వైపు నుండి పంజాగుట్ట, అమీర్పేట్ వెళ్ళు ప్రయాణికులు తార్నాక, రైలునిలయం రోడ్ ను నివారించి ఆర్.ట్.సి. X రోడ్ నుండి లక్డికాపూల్ నుండి వెళ్ళాలని సూచించారు. మేడ్చల్, బాలానగర్, ఖార్ఖనా, తిరుమలగిరి నుండి సికింద్రాబాద్ వైపు వెళ్ళు ప్రయాణికులు నేరెడిమేట్, మల్కాజ్ గిరి వైపు నుండి వెళ్ళాలని తెలిపారు. ప్రయాణికులందరూ తమ ప్రయాణాన్ని ముందుగా లేదా.. పైన సూచించిన సమయానుసారం ప్లాన్ చేసుకోవాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు.

Mango Express: ఈ సారి ఢిల్లీకి మ్యాంగో ఎక్స్ ప్రెస్ లేనట్లే..

Exit mobile version