Site icon NTV Telugu

ప్రజలను మోసం చేయడంలో ఆ ఇద్దరు ఒక్కటే : రేవంత్ రెడ్డి

బీజేపీ, టీఆర్ఎస్ రెండు పార్టీలు ఒక్కటే.. ప్రజలను మోసం చేయడంలో ప్రజలను పక్కదారి పట్టించడంలో ఇద్దరు దొంగలే అని టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి అన్నారు. కేసీఆర్, మోడీ.ఇద్దరు కలిసి రైతులను మోసం, నష్టం చేస్తున్నారు. పంజాబ్ తో సహా 24 రాష్ట్రాలలో పెట్రోల్, డీజిల్ పైన వ్యాట్ తగ్గించినపుడు తెలంగాణలో ఎందుకు తగ్గించరు. ప్రజలను దోచుకోవడంలో అవినీతి సొమ్ము దాచుకోవడంలో కేసీఆర్,మోడీ ఇద్దరు ఇద్దరే. బండి, గుండు కలిసి ప్రజలకు గుండు కొడుతున్నారు. ప్రగతి భవన్ లో కేసీఆర్ ప్రెస్ మీట్ మయ సభలో దుర్యోధనుడి ఏకపత్రాభినయం లాగా ఉంది. వరి వేయమని కేంద్రానికి చెప్పి వరి వేస్తే ఉరి అని కేసీఆర్ తెలంగాణ రైతులకు మరణ శాసనం రాసాడు. కేసీఆర్ రాజకీయాలకు తెలంగాణ ప్రజలు ఉరి పెట్టె రోజులు దగ్గర్లోనే ఉన్నాయి. రాయచూరు ప్రజలు తెలంగాణ మమ్మల్ని కలపాలని అంటున్నారు అని కేసీఆర్ అంటున్నారు.. తెలంగాణ ప్రజలు కేసీఆర్ ను బంగాళాఖాతంలో కలుపుతారు. ఇన్ని రోజులు మొద్దు నిద్ర నటించిన కేసీఆర్ ఇప్పుడు మోడీ పైన, బీజేపీ పైన యుద్ధం అంటూ మరోసారి నటిస్తున్నాడు. కేసీఆర్, మోడీ దొంగ నాటకాలకు తెలంగాణ ప్రజలు బుద్ధి చెవుతారు అని పేర్కొన్నారు.

Exit mobile version