ఢిల్లీలో తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ ఎన్టీవీతో మాట్లాడుతూ జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షులు ఎంపిక ప్రక్రియ తెలంగాణలో ప్రారంభమైందన్నారు. ఈ ప్రక్రియలో తెలంగాణా లోని కాంగ్రెస్ శ్రేణులు, నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొనాలని, పరిగణన లోకి తీసుకోవాల్సిన అంశాలు, ఇతర పూర్తి సమాచారాన్ని, అభిప్రాయాలను యధేచ్చగా నేతలు ఏఐసిసి పరిశీలకులకు అందజేయాలన్ని మహేష్ గౌడ్. డీసీసీ అధ్యక్షుల ఎంపిక నిష్పక్షపాతంగా జరుగుతుందని ఆయన హామీ ఇచ్చారు. ఎవరికీ, ఎలాంటి అనుమానాలు, అపోహలు పెట్టుకోవద్దని ఆయన స్పష్టం చేశారు. అంతేకాకుండా.. సీనియర్లంతా తమ విలువైన అభిప్రాయాలను ఏఐసిసి పరిశీలకులతో పంచుకోవాలని టీపీసీసీ మహేష్ గౌడ్ సూచించారు. భవిష్యత్తులో డీసీసీ అధ్యక్షులు పోషించే బాధ్యతల పరిధి విస్తృతం కానుందని ఆయన తెలిపారు.
Physical Harassment : ఖమ్మం స్కూల్‌లో షాక్..! విద్యార్థిని లైంగికంగా వేధించిన జువాలజీ టీచర్
అంతేకాకుండా.. అసెంబ్లీ అభ్యర్థుల ఎంపికలో కూడా డీసీసీ అధ్యక్షుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుంటారని, కాబట్టి, సమర్ధులైన, నిబద్ధతత గల కార్యకర్తలు, నేతలే డిసిసి అధ్యక్షులవుతారన్నారు. 42 శాతం బీసీలకు రిజర్వేషన్ కల్పించే అంశాన్ని మరోసారి సర్వోన్నత న్యాయస్థానం ముందుకు తెచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన తెలిపారు. ఒకటి, రెండు రోజుల్లో సుప్రీం కోర్టులో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అంశం విచారణ కు రానుందని ఆయన వెల్లడించారు.
Balmoor Venkat: జూబ్లీహిల్స్ లో ఓటమిని కేటీఆర్ అంగీకరించారు
