NTV Telugu Site icon

Revanth Reddy: మొత్తం మూడు వేదికలు.. దద్దరిల్లనున్న రేవంత్‌ రెడ్డి ప్రమాణ స్వీకార కార్యక్రమం

Revanth Reddy Lb Nagar Stedium

Revanth Reddy Lb Nagar Stedium

Revanth Reddy: తెలంగాణ రాష్ట్ర తొలి కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఎనముల రేవంత్ రెడ్డి గురువారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రమాణస్వీకారానికి సమయం మధ్యాహ్నం 1.04 గంటలకు నిర్ణయించారు. హైదరాబాద్‌లోని ఎల్‌బీ స్టేడియంలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి కాంగ్రెస్‌ ముఖ్యనేతలు సోనియా గాంధీ, రాహుల్‌గాంధీ, ప్రియాంక గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, భారత కూటమిలోని పార్టీల నేతలు హాజరవుతున్నారు. అలాగే తెలంగాణ అమరవీరుల కుటుంబ సభ్యులను ప్రత్యేక ఆహ్వానితులుగా, తెలంగాణవాదులను ఆత్మీయ అతిథులుగా ఆహ్వానించారు. రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీల నేతలకు కాంగ్రెస్ పార్టీ ఆహ్వానం పంపింది. కాంగ్రెస్ సీనియర్ నేతలకు మాణిక్ రావు థాక్రే ఫోన్ చేశారు. దామోదర రాజనర్సింహ, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ కు ప్రమాణస్వీకారానికి రావాలని పిలుపునిచ్చారు. తెలంగాణకు ఒకే ఒక ఉప ముఖ్యమంత్రి పదవి కాగా.. డిప్యూటీ సీఎంగా మల్లు భట్టి విక్రమార్క, మంత్రి వర్గంలోకి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నారు. ఇక ఉదయం 11 గంటలకు ఎల్లా హోటల్ నుంచి ఎల్బీ స్టేడియానికి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చేరుకోనున్నారు.

Read also: Samsung Galaxy S24 Series : శాంసంగ్ గెలాక్సీ S24 సిరీస్ మొబైల్స్ లాంచ్.. ఎప్పుడంటే?

ప్రమాణ స్వీకారోత్సవానికి ఎల్బీ స్టేడియంలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. మొత్తం మూడు వేదికలను ఏర్పాటు చేశారు.. ప్రధాన వేదికపై ప్రమాణ స్వీకారోత్సవం, ఎమ్మెల్యేలకు ఎడమవైపు 63 సీట్లతో ప్రత్యేక వేదిక, కుడివైపున వీవీఐపీలకు 150 సీట్లతో మరో వేదిక. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను చాటిచెప్పేందుకు 500 మందితో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. గోండు, డప్పు, ఒగ్గు, బోనాలు, శేరి బ్యాండ్ కళాకారులు రేవంత్‌కు స్వాగతం పలుకుతారు. తెలంగాణ అమరవీరుల కుటుంబాల కోసం 300 సీట్లతో ప్రత్యేక గ్యాలరీని ఏర్పాటు చేశారు. తెలంగాణ మేధావులు, ఉద్యమకారుల కోసం 250 సీట్లతో మరో గ్యాలరీని తయారు చేశారు. ముప్పై వేల మంది సామాన్యులు కూర్చునేలా ఏర్పాట్లు చేశారు. స్టేడియం వెలుపల వీక్షించేందుకు భారీ ఎల్‌ఈడీ స్క్రీన్‌లను ఏర్పాటు చేశారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను తెలిపేలా రేవంత్‌ప్రమాణానికి 500 మందితో సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. రేవంత్ రెడ్డికి గోండు, డప్పు, ఒగ్గు, బోనాలు, శేరి బ్యాండ్, కళాకారులు స్వాగత ఏర్పాట్లు చేశారు. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారానికి ఎల్బీ స్టేడియం ముస్తాబైంది. సమావేశానికి మూడు వేదికలను ఏర్పాటు చేశారు. బహిరంగ వేదికపై రేవంత్ ప్రమాణం చేయనున్నారు. ఎడమవైపు 63 సీట్లతో ఎమ్మెల్యేలకు ప్రత్యేక వేదికను ఏర్పాటు చేశారు. కుడివైపున వీవీఐపీల కోసం 150 సీట్లతో వేదికను సిద్ధం చేశారు.
Telangana Rains: తెలంగాణకు రెయిన్ అలర్ట్.. నేడ కూడా వర్షాలు పడతాయి