Site icon NTV Telugu

ముగిసిన మెంబర్ షిప్ సమీక్ష.. రేవంత్ దిశానిర్దేశం

తెలంగాణలో పెద్ద ఎత్తున మెంబర్ షిప్ చేయించాలని కృతనిశ్చయంతో వున్న టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆ దిశగా నేతలు, కార్యకర్తల్ని ముందుకు నడిపిస్తున్నారు. 5 మండలాలలో పార్టీ బలంగా ఉంటే అసెంబ్లీ గెలుస్తాం అన్నారు రేవంత్ రెడ్డి. 35 మండలాలలో బలంగా ఉంటే ఎంపీ స్థానం గెలుస్తాం.. 600 మండలాలలో పార్టీ బలపడితే రాష్ట్రంలో అధికారంలోకి వస్తాం అని రేవంత్ నేతలకు వివరించే ప్రయత్నం చేశారు.

మండలాలలో అధ్యక్షులు సరిగా పని చేయకపోతే వారిపై చర్యలు తప్పవు. మండలంలో 10 వేలు, నియోజకవర్గంలో 50 వేలు, పార్లమెంట్ నియోజక వర్గంలో 3.5 లక్షల మెంబెర్షిప్ చేయిస్తే వారికి రాహుల్ గాంధీతో సన్మానం చేయిస్తానని గతంలో చెప్పారు రేవంత్. రేపు అసెంబ్లీ ఇన్‌ఛార్జిలతో మెంబెర్షిప్ పైన సమావేశం ఏర్పాటుచేస్తానన్నారు. 30వ తేదీన ప్రత్యేకంగా ఒక్కో పార్లమెంట్ నియోజకవర్గం వారీగా మెంబెర్షిప్ పైన సమీక్ష చేస్తాం అని తెలిపారు. కార్యకర్తలు, నేతలు మెంబర్ షిప్ పై దృష్టి పెట్టాలన్నారు.

Exit mobile version