Site icon NTV Telugu

Revanth Reddy: సీఎం కేసీఆర్‌కు బహిరంగలేఖ.. ఏంటీ పక్షపాతం..!

ఇప్పటికే ఐఏఎస్‌ అధికారుల విషయంలో రాష్ట్రప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసిన పీసీసీ చీఫ్ రేవంత్‌ రెడ్డి.. ఇప్పుడు సీఎం కేసీఆర్‌కు బహిరంగ లేఖ రాశారు.. ఐఏఎస్ అధికారుల పోస్టింగ్‌లలో పక్షపాత వైఖరి సరికాదని సూచించారు.. బీహార్ అధికారులే మీకు నచ్చడం.. మెచ్చడం వెనక ఉద్దేశం ఏంటి..? అని లేఖలో ప్రశ్నించిన రేవంత్‌రెడ్డి… DOPT నిబంధనలకు వ్యతిరేకంగా సోమేష్ కుమార్‌ని ఎలా సీఎస్‌ను చేశారని నిలదీశారు.. HMDA, RERAలో అరవింద్, సోమేష్ కుమార్ ఇచ్చిన అనుమతులపై విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు రేవంత్‌రెడ్డి..

Read Also: Mekapati on YS Jagan: జగన్‌పై మేకపాటి సంచలన వ్యాఖ్యలు..

కాగా, రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ కేడర్​ఐఏఎస్​అధికారులపై ఈ మధ్యే సంచలన వ్యాఖ్యలు చేశారు పీసీసీ అధ్యక్షుడు రేవంత్​రెడ్డి.. వందలాది ఆత్మబలిదానాలతో తెచ్చుకున్న తెలంగాణలో.. స్థానిక అధికారులకు కీలక బాధ్యతలు దక్కడం లేదని ఆరోపించారు. బీహార్‌కు చెందిన ఐఏఎస్​అధికారులకు కీలక పదవులు అప్పగిస్తున్నారని ఆరోపించారు. సీఎస్, డీజీపీ పోస్టులనూ వారికే కట్టబెట్టారని విమర్శించారు. సీఎస్​సోమేష్‌​కుమార్, ఇంఛార్జీ డీజీపీ అంజనీకుమార్, సీనియర్​ఐఏఎస్​అధికారులు జయేష్‌ రంజన్, అర్వింద్​కుమార్, రజత్​కుమార్, సందీప్​కుమార్​సుల్తానియా, వికాస్​రాజ్‌కు మూడు నుంచి ఆరు శాఖలను కట్టబెట్టారని ఆరోపించారు. బీహార్​ఐఏఎస్‌లను రక్షణ వలయంగా చేసుకొని పరిపాలన చేస్తున్నారని విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే.

Exit mobile version