NTV Telugu Site icon

TPCC Protest event: నిరుద్యోగ సభ రద్దు కాలేదు.. కొత్త డేట్ ఇదే..

Revanthreddy

Revanthreddy

TPCC cancels Protest event: ఈ నెల 28 న నల్గొండలో కాంగ్రెస్ నిరుద్యోగ నిరసన సభ నిర్వహించేదుకు సన్నాహాలు మొదలయ్యాయి. 21న నిరుద్యోగ సభను నిర్వహించాలని రేవంత్ ప్రకటించడంతో పార్టీ శ్రేణుల్లోనే తీవ్ర వ్యతిరేకత మొదలైంది. ఇది కాస్త అధిష్టానానికి ఫిర్యాదు చేసేంత వరకు వెళ్లింది. ఈనేపథ్యంలో 21న జరగాల్సిన సభను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే సభను రద్దుచేయలేదని 21న జరగాల్సిన నిరుద్యోగ సభ వాయిదా వేశామని కొత్త డేట్ ఫిక్స్ చేశామని ఏఐసీసీ కార్యదర్శి నదీమ్ వెల్లడించారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి , రేవంత్ రెడ్డి లమధ్య సయోధ్యను కార్యదర్శి నదీమ్ కుదర్చడంతో ఈ వ్యవహారం కాస్త సర్దుమనిగింది. నిన్న వాయిదా పడ్డ సభ ఈనెల 28న నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు.

Read also: Bandi sanjay: నా గురువు కేసీఆర్‌ యే..! ఎందుకంటే?

ఈ నెల 21న నల్గొండ జిల్లాలో విద్యార్థి, నిరుద్యోగ నిరసన సభ నిర్వహించనున్నట్లు రేవంత్ ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సభను విజయవంతం చేయాలని రేవంత్ రెడ్డి జిల్లా నాయకత్వానికి పిలుపునిచ్చారు. అధిష్టానాన్ని సంప్రదించి, సీనియర్ నాయకులతో మాట్లాడి దీనిపై స్పష్టంత ఇస్తామని ప్రకటించారు. అయితే దీనిపై తెలంగాణ కాంగ్రెస్ సీనిరయర్లు అంతా గుర్రుమన్నారు. అంతేకాకుండా.. ఈ వార్తతో అదే జిల్లాకు చెందిన ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆశ్చర్యపోయారు. విద్యార్థి, నిరుద్యోగ నిరసన సభ గురించి తనకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా కార్యక్రమం ఎలా చేస్తారని ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రశ్నించిన విషయం తెలిసిందే.
TTD: శ్రీవారి భక్తులకు శుభవార్త.. ఈ రోజే ఆ టికెట్లు అన్ని విడుదల..