తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ (TOSS) ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఓపెన్ టెన్త్, ఓపెన్ ఇంటర్మీడియట్ పరీక్షల ఫీజు చెల్లింపు షెడ్యూల్‌ను అధికారులు శనివారం ప్రకటించారు. డిసెంబర్ 11 నుంచి 26వ తేదీ వరకు ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా పరీక్ష ఫీజు చెల్లించే అవకాశం కల్పించినట్లు టాస్ డైరెక్టర్ పీవీ శ్రీహరి తెలిపారు. డిసెంబర్ 27 నుంచి వచ్చే ఏడాది జనవరి 2 వరకు ఒక్కో పేపర్‌కు రూ.25 ఆలస్య రుసుముతో ఫీజు చెల్లించుకోవచ్చని వెల్లడించారు.
Notices To IndiGo: ఇండిగోకు నోటీసులు ఇచ్చిన విమానయాన శాఖ..
అలాగే జనవరి 3 నుంచి 7 వరకు ఒక్కో పేపర్‌కు రూ.50 ఫైన్‌తో ఫీజు చెల్లించే సదుపాయం ఉన్నట్లు చెప్పారు. తత్కాల్ కేటగిరీలో జనవరి 8 నుంచి 12 వరకు పరీక్ష ఫీజు చెల్లించే అవకాశం కల్పించనున్నట్లు స్పష్టం చేశారు. అదేవిధంగా, ఓపెన్ టెన్త్, ఓపెన్ ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలను మార్చి/ఏప్రిల్–2026లో నిర్వహించేందుకు తాత్కాలికంగా నిర్ణయించినట్లు టాస్ అధికారులు వెల్లడించారు.
Special Trains : తిరుపతికి ప్లాన్ చేస్తున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్..!
