రాష్ట్ర అభివృద్ధి కోసం చంద్రబాబు సీఎం కావటం చారిత్రక అవసరం
గన్నవరం నియోజకవర్గ టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావుకు వెలమ కుటుంబ సభ్యులు మద్దతు తెలిపారు. ఉంగుటూరు మండలం తేలప్రోలు గ్రామంలో ఆదివారం ఏర్పాటు చేసిన నియోజకవర్గ స్థాయి వెలమ కుటుంబ సభ్యుల ఆత్మీయ సమావేశంలో యార్లగడ్డ వెంకట్రావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం చంద్రబాబు ముఖ్యమంత్రి కావటం చారిత్రక అవసరం అన్నారు. చంద్రబాబుకు గన్నవరం నియోజకవర్గం వేదికగా అవమానం జరిగిందని, ఇక్కడ టీడీపీ జెండా ఎగరేసి బాబుకు గిఫ్ట్ ఇద్దామని పిలుపునిచ్చారు. తనను ఒక్క అవకాశం ఇచ్చి ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరారు. వెలమ కుటుంబ సభ్యుల సంక్షేమం, అభివృద్ధికి ప్రత్యేకంగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. నిరంతరం అందుబాటులో ఉండి ప్రజలకు సేవ చేస్తానని తెలిపారు. సైకిల్ గుర్తుపై ఓటేసి తనను ఎమ్మెల్యేగా, గాజు గ్లాసు గుర్తుకు ఓటేసి బాలశౌరిని ఎంపీగా అత్యధిక మెజారిటీతో గెలిపించాలని వెలమ కుటుంబ సభ్యులను అభ్యర్థించారు.
నేడు నారాయణపేటలో రేవంత్ పర్యటన.. జనజాతర సభకు హాజరు..
నేడు నారాయణపేట జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. మహబుబ్ నగర్ పార్లమెంట్ పై రేవంత్ రెడ్డి స్పెషల్ ఫోకస్ పెట్టినట్టు తెలుస్తుంది. జనజాతర పేరుతో నారాయణపేట జిల్లా కేంద్రంలో బారీ భహిరంగ సభకు హాజరుకానున్నారు. జిల్లా కేంద్రంలోని జూనియర్ కళాశాల మైదానంలో సభ జరగనుంది. మహబూబ్ నగర్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చల్లా వంశీచంద్ రెడ్డి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. సాయంత్రం 5 గంటలకు హెలికాప్టర్ ద్వారా నారాయణపేటకు సీఎం రేవంత్ రెడ్డి రానున్నారు. డిగ్రీ కళాశాల మైదానంలో సభ ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు.
మళ్ళీ తీహార్ జైలుకు కవిత.. ఈ నెల 23 వరకు జ్యుడీషియల్ కస్టడీ
బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీకి మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. మద్యం కుంభకోణం విచారణలో భాగంగా కవితకు రూస్ అవెన్యూ కోర్టు ఈ నెల 23 వరకు జ్యుడీషియల్ కస్టడీ విధించింది. అయితే.. కోర్టులో కవితను హాజరు పరిచిన సిబిఐ అధికారులు.. కవితని జ్యూడిషియల్ కస్టడీకి పంపాలని కోరింది. సాక్ష్యాలను కవిత ముందు పెట్టి విచారించామని, ఆమె విచారణకు సహకరించలేదని తెలిపింది. సీబీఐ వాదనలు విన్న కోర్టు.. కవితను 23 వరకు జ్యూడిషియల్ రిమాండ్ విధించింది. కాగా.. కవిత మాట్లాడుతూ.. ఇది బీజేపీ కస్టడీ.. సీబీఐ కస్టడీ కాదన్నారు. బయట బీజేపీ వాళ్ళు అడిగింది లోపల సీబీఐ అడుగుతుందన్నారు. రెండు నెలల నుంచి అడుగుతున్నారు. అడిగింది అడుగుతున్నారు కొత్తది ఏమీ లేదన్నారు.
సీఎం జగన్‌కు భారీ భద్రత..
ఇటీవల దాడి నేపథ్యంలో CM జగన్ భద్రతలో మార్పులు, చేర్పులు చేశారు. ప్రస్తుత భద్రతకు అదనంగా సెక్యూరిటీని ఏర్పాటు చేయగా.. బస్సు యాత్ర మార్గాల్లో DSPలతో భద్రత కల్పిస్తారు. CM రూట్ మార్గాలను సెక్టార్లుగా విభజించి.. సెక్టార్కు ఒక DSP, ఇద్దరు Clలు, నలుగురు SIలు సెక్యూరిటీ కల్పిస్తారు. ఇకపై నిర్దేశించిన ప్రాంతాల్లోనే CM రోడ్లు, సభలు ఉండనుండగా.. గజమాలలు, పువ్వులు విసరడంపై ఆంక్షలు అమల్లో ఉంటాయి. ఇదిలా ఉంటే.. CM జగన్ ‘మేమంతా సిద్ధం’ 15వ రోజు బస్సు యాత్ర ప్రారంభమైంది. యాత్ర ప్రారంభానికి ముందు పలువురు నేతలు ఆయన్ను పరామర్శించారు. గాయం తీవ్రత, ఇతర వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా నేతలతో నవ్వుతూ, చాలా సరదాగా జగన్ మాట్లాడారు. అటు CMపై దాడి జరిగిన కంటి ప్రాంతంలో ఇంకా వాపు కనిపిస్తుండగా.. దానిపై వైట్ బ్యాండెడ్ ఉంది. ఇక గాయం తీవ్రత నుంచి జగన్ త్వరగా కోలుకోవాలని YCP శ్రేణులు కోరుకుంటున్నాయి.
సీఎం జగన్‌పై దాడి.. ఈసీకి వైఎస్‌ఆర్‌సీపీ ఫిర్యాదు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై హత్యాయత్నం ఘటనపై అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైఎస్‌ఆర్‌సీపీ) నేతలు ఆదివారం రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. వైఎస్‌ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి, మల్లాది విష్ణు, ఇతర పార్టీ నేతలతో కూడిన ప్రతినిధి బృందం ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్‌కుమార్ మీనాను కలిసి తమ ఫిర్యాదులను స్వీకరించింది. ముఖ్యమంత్రిపై దాడి వెనుక కుట్ర కోణం ఉందని ఆరోపించిన వైఎస్‌ఆర్‌సిపి నేతలు, ఎన్నికల సంఘాన్ని సమగ్రంగా విచారించాలని కోరారు. సమావేశం అనంతరం సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ఎడమకంటిపై నుదిటిపై గాయం కావడంపై ఆందోళన వ్యక్తం చేశారు.
సీఎం జగన్‌పై దాడి.. ఈసీకి వైఎస్‌ఆర్‌సీపీ ఫిర్యాదు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై హత్యాయత్నం ఘటనపై అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైఎస్‌ఆర్‌సీపీ) నేతలు ఆదివారం రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. వైఎస్‌ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి, మల్లాది విష్ణు, ఇతర పార్టీ నేతలతో కూడిన ప్రతినిధి బృందం ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్‌కుమార్ మీనాను కలిసి తమ ఫిర్యాదులను స్వీకరించింది. ముఖ్యమంత్రిపై దాడి వెనుక కుట్ర కోణం ఉందని ఆరోపించిన వైఎస్‌ఆర్‌సిపి నేతలు, ఎన్నికల సంఘాన్ని సమగ్రంగా విచారించాలని కోరారు. సమావేశం అనంతరం సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ఎడమకంటిపై నుదిటిపై గాయం కావడంపై ఆందోళన వ్యక్తం చేశారు.
తెలంగాణ రైతు పేరుతో కిషన్ రెడ్డి రైతు దీక్ష..
హిమాయత్ నగర్ డివిజన్ లో కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఎన్నికల ప్రచార యాత్ర ప్రారంభించారు. హిమాయత్ నగర్ CDR హనుమాన్ టెంపుల్ నుంచి ప్రారంభమైంది. డోర్ టూ డోర్ ప్రచారం కిషన్ రెడ్డి నిర్వహిస్తున్నామని తెలిపారు. బీజేపీ మేనిఫెస్టోను ఓటర్లకు వివరిస్తున్నామని తెలిపారు. కాంగ్రెస్ గ్యారంటీ లను ప్రశ్నిస్తున్న తెలంగాణ రైతు దీక్ష చేపట్టారు. కాంగ్రెస్ గ్యారంటీ లను ప్రశ్నిస్తున్న తెలంగాణ రైతు పేరుతో బీజేపీ దీక్షను చేపట్టిందని తెలిపారు. వెంటనే 2 లక్షల రుణమాఫీ చేయాలన్నారు. వరికి 500 రూపాయల బోనస్ చెల్లించాలన్నారు. రైతు భరోసా 15 వేలు ఇవ్వాలని కోరారు. రైతు కూలీల అకౌంట్ లో 12 వేలు వెంటనే వేయాలన్నారు. ఎకరానికి 25 వేల పంట నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.
హైదరాబాద్ లో నేడు, రేపు బీజేపీ సంపర్క్ కార్యక్రమం
ఈరోజు, రేపు బీజేపీ సంపర్క్ పేరుతో ప్రతి ఇంటికి వెళ్లి మోడీ మూడో సారి దేశానికి ప్రధానిగా అవసరమని వివరించే కార్యక్రమం చేపట్టామని బీజేపీ రాజ్యసభ ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ అన్నారు. సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలోని ముషీరాబాద్ లో బీజేపీ ఎన్నికల ప్రచారంలో పాల్గొని డోర్ టు డోర్ ప్రచారం నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ప్రధాని నరేంద్ర మోడీ నిన్న సంకల్ప పత్రాన్ని విడుదల చేశారని గుర్తు చేశారు. అది దేశ భవిష్యత్తు కోసం, 140 కోట్ల దేశ ప్రజల ఆకాంక్ష నెరవేర్చే సంకల్ప పత్రం అని తెలిపారు. కేవలం ఓట్ల కోసం మేనిఫెస్టో ప్రకటించడం, గ్యారెంటీల పేరుతో ప్రజలను అభ్యపెట్టారని మండిపడ్డారు. 2047 వరకు ప్రపంచంలోనే అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దే పత్రమే ఈ సంకల్ప పత్రం అన్నారు. పది సంవత్సరాల మోడీ పాలనలో ఐదవ అతి పెద్ద ఆర్థిక దేశంగా తీర్చిదిద్ధాడని అన్నారు. దేశాన్ని వేగంగా అభివృద్ధి పథంలో నరేంద్ర మోడీ ముందుకు తీసుకువెళ్తున్నారని తెలిపారు.
ఇలాంటి దాడులు మనల్ని ఆపలేవు
ఎన్నికల్లో విజయం తమదేనని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. మేమంతా సిద్దం బస్సుయాత్ర ప్రారంభించే ముందు కేస్రపల్లి క్యాంపు కార్యాలయంలో సోమవారం తనను కలిసిన నేతలతో జగన్ మాట్లాడుతూ.. బస్సుయాత్ర అద్భుతంగా విజయవంతం కావడంతో అసూయతో ఉన్న ప్రతిపక్షాలు ఉన్మాద దాడులకు పాల్పడుతున్నాయన్నారు. ఇలాంటి దాడులు మనల్ని ఆపలేవని ఆయన వ్యాఖ్యానించారు. మనకు దేవుడి దయ, ప్రజల ఆశీర్వాదం ఉన్నాయని, ధైర్యంగా అడుగులు ముందుకు వేద్దామని సీఎం జగన్ వ్యాఖ్యానించారు.
కలసి వచ్చిన ఓడించలేం అని భావించి.. జగన్‌పై మరో కుట్ర చేస్తున్నారు…
ప్రజాబలం ఉన్న జగన్ పై ఎందుకు కక్ష కట్టారని, జగన్ పై అఘాయిత్యం చేయడానికి కుట్రాపన్నారని మంత్రి అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్ఆర్ మరణం తర్వాత, జగన్ ప్రజల కష్టాలు తీర్చడానికి ముఖ్యమంత్రి అయ్యాడని, ఎన్నికల కు ముందు, జగన్ ను గద్దె దించడానికి ముందు కుట్ర పన్నారని ఆయన మండిపడ్డారు. మూడు పార్టీ లు కలసి వచ్చిన ఓడించ లేం అని భావించి ,ఇప్పుడు జగన్ పై మరో కుట్ర చేస్తున్నారని ఆయన ఆరోపించారు. జగన్ ను ఏదో ఒక రకం గా హతమార్చాలని కుట్ర చేస్తున్నారని, చంద్రబాబు,పవన్ కల్యాణ్ లకు చెప్తున్నా మరొక రాయి జగన్ పై పడితే ఈ రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని క్షమించరని ఆయన అన్నారు.
