Site icon NTV Telugu

Top Headlines @1PM : టాప్‌ న్యూస్‌

Top Headlines @ 1 Pm

Top Headlines @ 1 Pm

వరుసకు అన్నాచెల్లెళ్ళు.. అయినా ప్రేమించుకున్నారు.. చివరికి ఏమైందంటే?

ఆ యువతికి రెండేళ్ల క్రితమే పెళ్లైంది. భర్తను విడిచిపెట్టి తల్లిదండ్రులతో ఉంటుంది. ఈ క్రమంలో వరుసకు అన్న అయే వ్యక్తితో ప్రేమలో పడింది. చివరకు ఇరుకుటుంబాల్లో వీరి వ్యవహారం తెలిసిపోయింది. ఏడాదిగా వీరిద్దరు ప్రేమించుకుంటున్నా వరుసకు అన్నాచెల్లెళ్లు కావటంతో పెళ్లికి ఒప్పుకోలేదు తల్లిదండ్రులు. దీంతో ప్రేమ జంట ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన ప్రకాశం జిల్లా కొమరోలు మండలం అక్కపల్లె సమీపంలో చోటుచేసుకుంది. మృతి చెందిన ప్రేమికులది నంద్యాల జిల్లా ప్యాపిలి మండలం మాధవరంగా గుర్తించారు.

ప్రభుత్వ విద్యకు బ్రాండ్ అంబాసిడర్స్.. మా’స్టార్స్’.. మీకు హేట్సాఫ్

ప్రభుత్వ పాఠశాలల్లో ఆధునిక వసతులు కల్పిస్తూ.. కార్పోరేట్ పాఠశాలలకు దీటుగా తీర్చుదిద్దుతోంది ఏపీ ప్రభుత్వం. అయితే కొందరు తమ పిల్లలను ప్రైవేట్ పాఠశాలలకు పంపిస్తూ అక్కడే క్వాలిటీ ఎడ్యుకేషన్ లభిస్తుందని భావిస్తున్నారు. ఇలాంటి అనుమానాలను పటాపంచలు చేస్తూ ప్రభుత్వ ఉపాధ్యాయులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించి ఆదర్శంగా నిలిచారు. టీచర్ల చొరవపై ఏపీ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలియజేశాడు.

గోల్డెన్ బాయ్ ఖాతాలో మరో స్వర్ణ పతకం..

నీరజ్ చోప్రా.. ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 2020 టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణం సాధించి భారత జావెలిన్ చరిత్రను తిరగరాసిన అతను, అప్పటి నుంచి వరుస విజయాలతో దూసుకెళ్తున్నాడు. 2022 వరల్డ్ అథ్లెటిక్ ఛాంపియన్‌షిప్‌లో రజత పతకంతో మెరిశాడు. అలాగే పారిస్ ఒలింపిక్స్ 2024 ఒలింపిక్స్ లో వెండి పతకంతో పట్టు ఆ తర్వాత జరిగిన అనేక లీగ్ లలో అనేక మెడల్స్ సాధించాడు.

టీమిండియా అరుదైన రికార్డు.. 148 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఇదే మొదటిసారి!

టెస్ట్ క్రికెట్‌లో భారత పురుషుల జట్టు చరిత్ర సృష్టించింది. ఓ టెస్ట్ మ్యాచ్‌లో తొలిసారి 1000 పరుగుల మార్కును అందుకుంది. ఎడ్జ్‌బాస్టన్‌లో ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌లో టీమిండియా ఈ అరుదైన రికార్డు సాధించింది. ఓ టెస్ట్ మ్యాచ్‌లో 1,000 పరుగులు దాటిన ఆరో జట్టుగా నిలిచింది. తొలి ఇన్నింగ్స్‌లో 587 పరుగులు చేసిన టీమిండియా.. రెండో ఇన్నింగ్స్‌లో 427/6 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. దాంతో మొత్తంగా భారత్ 1014 పరుగులు చేసింది.

మాజీ సీజేఐ డీవై చంద్రచూడ్‌ కు సుప్రీంకోర్టు షాక్.. కారణం ఏంటంటే?

భారత 50వ ప్రధాన న్యాయమూర్తి (CJI) అయిన DY చంద్రచూడ్ పదవీ విరమణ చేసి 8 నెలలు అయింది. కానీ ఆయన ఇంకా తన ప్రభుత్వ నివాసాన్ని ఖాళీ చేయలేదు. ఇప్పుడు సుప్రీంకోర్టు దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. మాజీ సీజేఐని వీలైనంత త్వరగా బంగ్లాను ఖాళీ చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. అదే సమయంలో, డివై చంద్రచూడ్ బంగ్లాను ఖాళీ చేయడానికి గల కారణాన్ని కూడా స్పష్టంగా పేర్కొన్నారు. సుప్రీంకోర్టు జూలై 1న గృహనిర్మాణం, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు లేఖ రాసి, వెంటనే బంగ్లాను ఖాళీ చేయాలని ఆదేశించింది. సుప్రీంకోర్టు తన నోటీసులో ఇలా పేర్కొంది- గౌరవనీయులైన డి.వై. చంద్రచూడ్ జీ.. కృష్ణ మీనన్ మార్గ్‌లోని బంగ్లా నంబర్ 5ని ఎటువంటి ఆలస్యం లేకుండా ఖాళీ చేయమని మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాము. 2022 నియమం 3B ప్రకారం, అతను అదనంగా 6 నెలలు బంగ్లాలో ఉండటానికి అనుమతించారు. ఈ వ్యవధి 10 మే 2025న ముగిసింది.

ఏంటి సమంత.. అలా స్టేజిపై ఏడ్చేశావ్.. అభిమానులు ఏమై పోవాలి..!

2010లో ‘ఏ మాయ చేశావే’ సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన సమంత రూత్ ప్రభు, అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. ఓ బేబీ, శాకుంతలం, యశోద, మజిలీ వంటి చిత్రాలతో తన నటనకు మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఫిట్‌నెస్, ఆత్మవిశ్వాసం, నటనతో పాటు సోషల్ మాధ్యమాల్లోనూ సమంతకు మంచి ఫాలోయింగ్ ఉంది. వ్యక్తిగత జీవితంలో కొన్ని ఒడిదుడుకులు ఎదురైనా, ఆమె దృఢంగా ముందుకెళ్తూ తెలుగు ప్రేక్షకులతో పటు దక్షిణాది సినీ అభిమానుల మనసుల్లో తన స్థానం నిలబెట్టుకుంది.

బ్రిక్స్ శిఖరాగ్ర సమ్మేళనంలో పాల్గొననున్న మోదీ.. బ్రెజిల్‌లో ఘన స్వాగతం..!

భారత ప్రధాని నరేంద్ర మోదీ నాలుగు రోజుల అధికార పర్యటన నిమిత్తం బ్రెజిల్‌ లోని రియో డి జనీరోకు చేరుకున్నారు. ఆయనకు అక్కడి భారత దేశ వలసదారుల సముదాయం అత్యంత ఘన స్వాగతం పలికింది. సంప్రదాయ సంగీతం, నృత్యాలతో ప్రధానిని ఆహ్వానించారు. ముఖ్యంగా ‘ఓపరేషన్ సింధూర్’ థీమ్‌పై నిర్వహించిన నృత్య ప్రదర్శనతో సభా ప్రాంగణం మార్మోగింది. అలాగే ఇతర ప్రదర్శనలతో పాటు, బ్రెజిలియన్ సంగీత బృందం భారత ఆధ్యాత్మిక సంగీతాన్ని ప్రదర్శించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇది భారతీయ సాంస్కృతిక విలువలను ప్రదర్శించడమే కాక, అంతర్జాతీయ స్థాయిలో భారత గౌరవాన్ని పెంచింది.

విజయ్ ను చూసి మిగతా హీరోలు నేర్చుకోవాలి.. దిల్ రాజు కామెంట్స్..

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతిపై దిల్ రాజు ప్రశంసలు కురిపించారు. ఆయన్ను చూసి మిగతా హీరోలు నేర్చుకుంటే నిర్మాతలకు లాభం జరుగుతుందన్నారు. ఈ నడుమ హీరోల గురించి దిల్ రాజు చేస్తున్న కామెంట్లు ఎప్పటికప్పుడు హాట్ టాపిక్ అవుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆయన మాట్లాడుతూ.. విజయ్ వర్కింగ్ స్టైల్ వేరేలా ఉంటుంది. ఆయన ముక్కుసూటిగా ఉంటారు. సినిమా షూటింగ్ ఎన్ని రోజులు అవుతుందో ముందే తెలుసుకుని ఇన్ని రోజులు ఇస్తానని చెప్పేస్తారు. ఆయన చెప్పినన్ని రోజులు కచ్చితంగా వస్తారు. అలాంటప్పుడు డైరెక్టర్లు, నిర్మాతలకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. నెలకు 20 రోజుల చొప్పున ఆయన డేట్లు ముందే చెప్పేస్తారు.

రెచ్చిపోతున్న మెడికల్ మాఫియా.. వయాగ్రా ట్యాబ్లెట్స్, అబార్షన్ కిట్ల అమ్మకాలు జోరు

తూర్పుగోదావరి జిల్లాలో మెడికల్ మాఫియా రెచ్చిపోతున్నట్లు డ్రగ్ కంట్రోల్ అధికారులు గుర్తించారు. రాజమండ్రిలోని మెడికల్ షాపుల్లో డ్రగ్ కంట్రోల్ అధికారులు దాడులు నిర్వహించారు. డ్రగ్ కంట్రోల్ అధికారుల తనిఖీల్లో అక్రమాలు బయటపడ్డాయి. డాక్టర్ ప్రిస్కిప్షన్‌ లేకుండా నిషేధిత మందులు విచ్చలవిడిగా అమ్ముతున్నట్లు గుర్తించారు. నిషేధిత మందులు ఎమ్మార్పి కంటే ఎక్కువ ధరకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు అక్రమార్కులు. వయాగ్రా ట్యాబ్లెట్స్, అబార్షన్ కిట్ల అమ్మకాలు జోరుగా సాగుతున్నట్లు గుర్తించారు.

విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ అభిమానులకు షాక్!

వచ్చే ఆగస్టులో జరగాల్సిన భారత్, బంగ్లాదేశ్ పరిమిత ఓవర్ల సిరీస్ వాయిదా పడింది. ఈ విష‌యాన్ని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) శనివారం విడుదల చేసిన ఓ ప్రకటనలో ధ్రువీక‌రించింది. బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ), బీసీసీఐ సంయక్తంగా ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు తెలిపింది. కొత్త షెడ్యూల్‌ను తరువాత విడుదల చేస్తామని బీసీసీఐ పేర్కొంది. ఈ సిరీస్ సెప్టెంబర్ 2026లో నిర్వ‌హించేందుకు బీసీబీ సముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. బంగ్లాదేశ్‌లో షేక్‌ హసీనా ప్రభుత్వం కుప్పకూలాక హింసాత్మక ఘటనలతో బంగ్లా అట్టుడికింది. ప్రముఖులపై కూడా దాడులు జరిగాయి. దాంతో బంగ్లా-భార‌త్ సిరీస్‌పై ముందునుంచి నీలినీడ‌లు క‌మ్ముకున్నాయి. బంగ్లా ప‌ర్య‌ట‌న‌కు టీమిండియాను పంపేందుకు ప్ర‌భుత్వ అనుమతి కోసం బీసీసీఐ ఇన్నాళ్లు ఎదురు చూసింది. భద్రతా కారణాల దృష్ట్యా పర్యటనను వాయిదా వేసుకోమని ప్రభుత్వం బీసీసీఐకి సూచించిన నేపథ్యంలో శనివారం కీలక ప్రకటన చేసింది. బంగ్లా-భార‌త్ మధ్య వన్డే, టీ20 సిరీస్‌లు ఆగస్టు 17 నుండి ప్రారంభం కావాల్సి ఉంది. ముందుగా మూడు వన్డేలు, ఆపై మూడు టీ20లు జరగాల్సి ఉండే.

‘నన్ను నమ్ము’.. సిరాజ్ కు గిల్ సూచన.. ఆ ప్లాన్ అమలు చేసిన వెంటనే..?

ఇంగ్లాండ్‌లో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా కెప్టెన్‌గా తన రెండో మ్యాచ్‌ ఆడుతున్న శుభ్‌మ‌న్ గిల్ తన అనుభవంతో కాకుండా.. తన అర్థవంతమైన నిర్ణయాలతో సీనియర్లను కూడా ఆశ్చర్యపరుస్తున్నాడు. బర్మింగ్‌హామ్ టెస్టులో జరిగిన ఓ ఆసక్తికర ఘటన ఇప్పుడు అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. భారత బౌలింగ్‌ కు నాయకత్వం వహిస్తున్న మొహమ్మద్ సిరాజ్ తో ఫీల్డింగ్ సెట్టింగ్ పై గిల్ తీవ్ర చర్చ జరిపాడు.

 

Exit mobile version