Site icon NTV Telugu

Tollywood: టాలీవుడ్ ప్రముఖుల భేటీకి హాజరైన వాళ్లు వీళ్లే..!!

హైదరాబాద్ ఫిల్మ్‌నగర్ కల్చరల్ క్లబ్‌లో టాలీవుడ్ సినీ ప్రముఖలు సమావేశమయ్యారు. సినీ పరిశ్రమ సమస్యలు, కార్మికుల సంక్షేమంపై చర్చిస్తున్నారు. ఈ స‌మావేశానికి నిర్మాత‌లు న‌ట్టి కుమార్, సి.క‌ళ్యాణ్, ప్ర‌స‌న్న‌కుమార్‌, ద‌ర్శకుడు రాజ‌మౌళి, త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజతో పాటు 24క్రాఫ్ట్స్‌కు చెందిన ప్రముఖుల పాల్గొన్నారు. ఈ భేటీలో క‌రోనా కార‌ణంగా సినీ ప‌రిశ్ర‌మ ఎదుర్కొన్న ఇబ్బందులు, ఆటంకాలు, రెండు తెలుగు రాష్ట్రాల ప్ర‌భుత్వాలు ఇటీవ‌ల జారీ చేసిన జీవోలు, సినీ కార్మికుల సంక్షేమంపై ఈ స‌మావేశంలో చర్చించనున్నారు.

ఇటీవల మెగాస్టార్ చిరంజీవి నేతృత్వంలో పలువురు సినీ ప్రముఖులు ఏపీ సీఎం జ‌గ‌న్‌ను క‌ల‌సి అద‌న‌పు షోలు, టికెట్ రేట్ల విష‌యాల‌పై చ‌ర్చించారు. సీఎం జగన్‌ను కలిసిన వారిలో మెగాస్టార్ చిరంజీవి‌, ప్ర‌భాస్, మ‌హేష్ బాబు, రాజ‌మౌళి, కొరటాల శివ, ఆర్.నారాయ‌ణ మూర్తి, ఆలీ, పోసాని ఉన్నారు. ఏపీ సీఎం జగన్‌తో స‌మావేశం త‌ర్వాత తొలిసారిగా సినీప్ర‌ముఖుల భేటీ జ‌రుగుతోంది. ఈ సమావేశంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో వేచి చూడాలి.

Exit mobile version