ప్రస్తుతం దేశంలో వ్యాక్సినేషన్ జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే భారత ప్రభుత్వం రష్యాకు చెందిన స్పుత్నిక్ వ్యాక్సిన్ కు అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. ఇక తాజాగా హైదరాబాద్- శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు స్పుత్నిక్ వ్యాక్సిన్ చేరుకుంది. రష్యా నుండి ప్రత్యేక విమానంలో వచ్చిన 56.6 టన్నుల స్పుత్నిక్ వ్యాక్సిన్ ను శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కార్గో లో దిగుమతి అయింది. వ్యాక్సిన్ రష్యా నుండి ప్రత్యేక ఛార్టర్డ్ ఫైట్ ( RU-9459) లో హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్ కార్గోకు చేరుకుంది. ఇప్పటి వరకు భారతదేశానికి వచ్చిన కోవిడ్ వ్యాక్సిన్ లలో ఈ 56.6 అతి పెద్ద వ్యాక్సిన్ దిగుమతి.