Site icon NTV Telugu

KCR: నేడు మంచిర్యాలలో కేసీఆర్‌ భారీ రోడ్‌ షో..

Kcr

Kcr

KCR: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రాక కోసం ఉమ్మడి జిల్లా ప్రజలు, శ్రేణులు ఉత్కంఠగా ఎదురుచూస్తుండగా.. ఆ తరుణం రానే వచ్చింది. ఈరోజు మంచిర్యాల్ లో కేసీఆర్ రోడ్ షో నిర్వహించనున్నారు. విజయవంతం చేసేందుకు బీఆర్ఎస్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. జిల్లా కేంద్రంలోని ఐబీ చౌరస్తాలో సాయంత్రం 6.30 గంటలకు రోడ్ షో ప్రారంభమవుతుంది. ఎంపీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బస్సు యాత్ర కొనసాగనుంది. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా కేసీఆర్ ఏప్రిల్ 24న బస్సుయాత్ర ప్రారంభించిన సంగతి తెలిసిందే.

Read also: BRS KTR: చలువ పందిర్లు, త్రాగు నీరు ఏర్పాటు చేయండి.. మున్సిపల్ చైర్మన్ కు కేటీఆర్ ఆదేశం..

మిర్యాలగూడ నుంచి ప్రారంభమైన కేసీఆర్ సమర శంఖారావం ప్రధాన నగరాలను తాకి మంచిర్యాలకు చేరుకుంది. బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ శుక్రవారం రాత్రి 8 గంటలకు గోదావరిఖనిలో రోడ్‌షో నిర్వహించి శనివారం సాయంత్రం మంచిర్యాల జిల్లాకు రానున్నారు. స్థానిక ఐబీ చౌరస్తాలో కేసీఆర్ రోడ్ షోను ఘనంగా నిర్వహించేందుకు బీఆర్ ఎస్ సన్నద్ధమవుతోంది. కేసీఆర్ కు ఘనస్వాగతం పలికేందుకు మంచిర్యాల జిల్లా ప్రజలు సిద్ధమయ్యారు. ఈ సభలో కేసీఆర్ ఏం మాట్లాడతారోనని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కేసీఆర్ రాక కోసం సింగరేణి కార్మికులే కాకుండా అన్ని వర్గాల ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
CM Revanth Reddy: నేడు 4 లోక్‌సభ నియోజకవర్గాల్లో సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం..

Exit mobile version