Site icon NTV Telugu

What’s Today : ఈ రోజు ఏమున్నాయంటే..?

Whats Today

Whats Today

* హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో స్వాతంత్య్ర వజ్రోత్పవ వేడుకల ముగింపు కార్యక్రమం. ముఖ్య అతిథిగా హాజరుకానున్న సీఎం కేసీఆర్, మంత్రులు, అధికారులు… నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు

*నేడు సంగారెడ్డి జిల్లాలో ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు పర్యటన..ఉదయం 10.30 గంటలకు కలెక్టర్ కార్యాలయంలో మంత్రి హరీష్ రావు ప్రెస్ మీట్..మద్యాహ్నం సంగారెడ్డి ఓల్డ్ బస్టాండ్ దగ్గర భరోసా సెంటర్, ఇందిరా నగర్ లో యోగ సెంటర్, ఆయుష్ సెంటర్ లను ప్రారంభించనున్న మంత్రి హరీష్ రావు

* కాకినాడ యు కొత్తపల్లి మండలం ఉప్పాడలో డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడు పర్యటన

* ఇవాళ సాయంత్రం ప్రియాంకగాంధీతో తెలంగాణ కాంగ్రెస్ ముఖ్యనేతల భేటీ..

*నేడు మంగళగిరిలో జనసేన పార్టీ పీఏసీ సమావేశం. పాల్గొననున్న పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్

* మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో రక్తదాన, సామాజిక సేవా కార్యక్రమాలు

*నేడు ఎమ్మెల్సీ అనంతబాబు బెయిల్ పిటిషన్ పై రాజమండ్రి ఎస్సీ, ఎస్టీ అట్రాసిటి కోర్టులో విచారణ

*అమరావతి ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో ప్రొఫెసర్లు, విద్యార్థుల ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొననున్న నోబుల్ గ్రహీత మానవ హక్కుల ఉద్యమకారుడు ప్రొఫెసర్ కైలాష్ సత్యార్థి

*నేడు చింతపల్లిలో అల్లూరి తిరుగుబాటు శతాబ్ది ఉత్సవాలు….పాల్గోననున్న కేంద్ర మంత్రులు అర్జున్ ముండా, కిషన్ రెడ్డి, ఏపీ ప్రభుత్వం తరపున ఆర్కే రోజా, రాజన్నదొర

*పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం లో 1.34 కోట్లతో పలు అభివృద్ది పనులకి శంకుస్థాపన చేయనున్న ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్..అనంతరం గడప గడపకి మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొనున్న ఎమ్మెల్యే

*ఢిల్లీలో ఏపీ సీఎం జగన్ పర్యటన.. ఉదయం ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ కానున్న ముఖ్యమంత్రి

Exit mobile version