Site icon NTV Telugu

Balkampet Ammavari Kalyanam: పట్టువస్త్రాలు సమర్పించనున్న మంత్రులు

Balkapet Ammavari Kalyanam

Balkapet Ammavari Kalyanam

నేడు బల్కంపేట ఎల్లమ్మ కల్యాణానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇవాళ‌ జరిగే ఈ కార్యక్రమం కోసం సర్వాంగ సుందరంగా మండపాన్ని తీర్చిదిద్దారు. కాగా.. బోనం కాంప్లెక్స్‌ను పరిశుభ్రం చేస్తున్నారు. అమ్మ‌వారి ఆల‌యం వ‌ద్ద‌ ప్రధాన రహదారిపై ఏర్పాటుచేసిన కల్యాణ మండపం ఎదుట, వెనుక రోడ్లను బ్లాక్‌ చేసి క్యూలు, బారికేడ్లు ఏర్పాటుచేశారు. నిన్న సోమవారం నుంచే భక్తుల రాక మొదలైంది. దీంతో.. భ‌క్తుల‌కు ఎటువంటి ఇబ్బంది త‌లెత్త‌కుండా.. భారీగా వర్షం కురిసినా భక్తులు తడవకుండా ఉండేందుకు షామియానాలు, చలువ పందిళ్లు ఏర్పాటుచేశారు.

read also: Gold Rates: స్థిరంగా బంగారం ధరలు.. మరి వెండి?

నిన్న అర్చ‌కులు.. వేద పండితులు గణపతి పూజతో ఉత్సవాలను ప్రారంభంకాగా.. ఎస్‌ఆర్‌నగర్‌లోని వేంకటేశ్వరస్వామి ఆలయం నుంచి ఎదుర్కోళ్లను ప్రారంభించి, ఒగ్గు కళాకారులతో గంగతెప్ప, పుట్ట బంగారాన్ని అర్చకులు, ధర్మకర్తలు శాస్త్రోత్తంగా ఆలయానికి తీసుకొచ్చారు. బ‌ల్కంఎల్లమ్మ కల్యాణం ఉత్తరా నక్షత్రయుక్త కన్యాలగ్న సుముహూర్తమున వేద పండితుల మంత్రోచ్ఛారణల నడుమ నేడు ఉదయం 11.45 గంటలకు జరగనుంది. బ‌ల్కం అమ్మవారికి ముత్యాల తలంబ్రాలు, పట్టు వ‌స్త్రాల‌ను దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ దంపతులు తీసుకురానున్నారు. అయితే.. భక్తుల సౌకర్యార్థం రూ.36 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన రేకుల షెడ్డును మంత్రి తలసాని నిన్న (సోమ‌వారం) ప్రారంభించారు. అనంతరం కల్యాణం ఏర్పాట్లను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.

America: అమెరికాలో మళ్లీ కాల్పుల మోత.. ఆరుగురు మృతి, 24 మందికి గాయాలు

Exit mobile version