తెలంగాణ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య మూడు వందల దిగువగా చేరాయి. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 245 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.. ఒక్కరు కన్నుమూశారు.. ఇదే సమయంలో 582 మంది కరోనా బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నట్టు బులెటిన్‌లో పేర్కొంది ప్రభుత్వం. దీంతో.. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 6,52,380 కు చేరుకోగా… కోలుకున్నవారి సంఖ్య 6,41,270 కు పెరిగింది… ఇక, ఇప్పటి వరకు 3,842 మంది కోవిడ్ బాధితులు మృతిచెందారు.. రాష్ట్రంలో కరోనా రికవరీ రేటు 98.29 శాతం ఉండగా.. దేశంలో 97.44 శాతంగా ఉందని.. ప్రస్తుతం 7,268 యాక్టివ్ కేసులు ఉన్నాయని.. ఇవాళ ఒకేరోజు 50,126 శాంపిల్స్ పరీక్షించినట్టు బులెటిన్‌లో పేర్కొంది సర్కార్.
తెలంగాణలో మూడు వందలకు దిగువగా కరోనా కేసులు…
corona