Tiger Fear: పులుల సంచారం తెలంగాణ రాష్ట్రంలో కలకలం రేపుతోంది. పులి సంచారం గ్రామాలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది..అడుగుతీసి అడుగు వేయాలంటే జనం జంకుతున్నారు..పంటపొలాల వైపు వెళ్ళాలంటే జడుసుకునే పరిస్థితి ఎదురౌతోంది. ఆదిలాబాద్, మంచిర్యాల జిల్లాల్లో పులి సంచారం కంటిమీదకునుకు లేకుండా చేస్తున్నాయి. ఇక ఆదిలాబాద్ జిల్లాలో పిప్పల్ కోటి కాల్వ పనులు కొనసాగుతున్న ఏరియాలో పులి కనిపించింది.
దీంతో ఓ వాహన డ్రైవన్ పులి ని సెల్ ఫోన్ లో వీడియో తీసి అధికారులకు సమచారం అందించడంతో.. రంగంలోకి దిగిన అధికారులు పులి మహారాష్ట్ర లోని తిప్పేశ్వర్ టైగర్ రిజర్వ్ నుంచి వచ్చినట్లు తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా వుండాలని కోరారు. ఇక మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం బుద్ధారం గ్రామ సమీప అటవీ ప్రాంతంలో పులి సంచారం భయాందోళనకు గురిచేస్తోంది. దీంతో అటవీశాఖ అధికారులు ఎంట్రీ ఇచ్చి పులి అడుగులను గుర్తించారు. అటవీ ప్రాంతం వైపు ఎవరు వెళ్లకూడదని ప్రజలకు అటవీ అధికారుల సూచించారు.