NTV Telugu Site icon

Accident: ఔటర్ రింగ్ రోడ్డుపై ప్రమాదం.. ముగ్గురు మృతి

Road Accident

Road Accident

హైదరాబాద్‌ శివార్లలోని ఔటర్ రింగ్‌రోడ్డుపై ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న కంటైనర్‌ను కారు ఢీకొనడంతో అక్కడికక్కడే ముగ్గురు ప్రాణాలు కోల్పోగా.. మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన శంషాబాద్ మండలంలోని పెద్దగోల్కొండ వద్ద చోటుచేసుకుంది. చనిపోయిన వారు మహారాష్ట్ర వాసులుగా పోలీసులు గుర్తించారు. ఆ కంటైనర్ మహరాష్ట్రకు చెందినదిగా… పెద్దఅంబర్‌పేట్ నుంచి శంషాబాద్ వైపు వస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. కారులో ఇరుక్కున్న వారిని రక్షించేందుకు పోలీసులు ఎంతగానో ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. ఈ ప్రమాదంలో గాయపడిన మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. క్షతగాత్రులను శంషాబాద్‌లోని ఓ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతదేహాలను శవపరీక్ష కోసం ఉస్మానియాకు తరలించారు. మద్యం మత్తు వల్లే ప్రమాదం జరిగినట్లుగా గుర్తించారు. మృతులు ఔరంగాబాద్ వాసులు ఆనంద్, సంపత్, రంగనాథ్‌లుగా పోలీసులు గుర్తించారు. తిరుపతి వెళ్లి తిరిగి మహారాష్ట్రకు వెళ్తుండగా ప్రమాదం జరిగింది.

Office Romance: ఆ ఇద్దరు అడ్డంగా బుక్.. వీడియో లీక్!

ఇంటి నుంచి బయటికి వెళ్లిన వారు తిరిగి వచ్చే దాకా భయాందోళనే. కొందరు నిర్లక్ష్యం మరికొందరి పాలిట శాపంగా మారుతుండగా అమాయకులు అనాథలుగా మారుతున్నారు. అతివేగం, నిర్లక్ష్యం, మద్యం మత్తులో వాహనాలు నడపటం… ఇలా అడుగడుగునా ట్రాఫిక్‌ నిబంధనల ఉల్లంఘనలతో అమాయకుల ప్రాణాలను బలితీసుకుంటున్నాయి.సైబరాబాద్‌ పోలీసు కమిషరేట్‌ పరిధిలో 5’నెలల వ్యవధిలో 1,493 రోడ్డు ప్రమాదాలు జరిగాయి. ఈ ఘటనల్లో 356 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 1,403 మంది గాయాలపాలయ్యారు. రోడ్డు ప్రమాదాలు అధికంగా జరుగుతున్న 10 బ్లాక్‌ స్పాట్‌లను గతేడాది గుర్తించిన పోలీసులు నియంత్రణకు చర్యలు చేపట్టారు. ఈ ఏడాది కొత్తగా మరో 15 ప్రాంతాలు ప్రమాదకరమైనవిగా నిర్దారించారు. ఎన్ని చర్యలు చేపట్టినా ప్రమాదాలకు అడ్డుకట్ట వేయటం పోలీసు యంత్రాంగానికి సవాల్‌గా మారుతోంది.

Show comments