Asifabad: కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ అడవుల్లో ఏం జరుగుతోంది..? ఒక పులి మృతి చెందిన రెండు రోజులకే మరో పులి మృతి చెందడం రాష్ట్రంలో సంచలనంగా మారింది. మరో నాలుగు పులులు అదృశ్యం కావడం చర్చనీయాంశంగా మారింది. దీంతో కాగజ్ నగర్ అడవుల్లో ఏం జరుగుతోందో అర్థం కానీ పరిస్థితులు నెలకొన్నాయి. మొదటి పులి మృతి చెందిన రోజు నుంచి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన 70 మంది సిబ్బందితో పాటు అటవీశాఖాధికారులు కాగజ్ నగర్ రేంజ్ ఫారెస్ట్ రేంజ్ పరిధిలో పులుల జాడ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. చివరకు పులుల మృతి కేసులో ఎట్టకేలకు మిస్టరీ ఛేందించారు. పులులను చంపింది ముగ్గురుని అదుపులో తీసుకున్నారు. అయితే ముగ్గురిలో ఒకరు మైనర్ బాలుడు ఉండటం గమనార్హం. పులులను చంపాలనే ఉద్దశ్యంతోనే పశు కళేబరంపై విషం చల్లినట్లు నిందితులు విచారణలో అంగీకరించారని అటవీశాఖ అధికారులు వెల్లడించారు. నిందితులను అదుపులోకి తీసుకుని విచారించడంతో పాటు సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేశారు పోలీసులు.
Read also: Red Sea Crisis: హౌతీ రెబల్స్ నియంత్రణలో ఉన్న మరో స్థావరంపై యూఎస్ సైన్యం దాడి
అదుపులో తీసుకున్న ముగ్గురు నిందితులు ఆసిఫాబాద్ డివిజన్ వాంకిడి మండలం వెల్లి గ్రామపంచాయతీ పరిధిలోని రెంగరీట్ గ్రామానికి చెందిన వారుగా గుర్తించారు. కోవా గంగు, ఆత్రం జల్ పతితోపాటు 11 ఏళ్ల మైనర్ బాలుడు పులులపై విషప్రయోగం చేసిన వారిలో ఉన్నట్లు అటవీశాఖ అధికారులను నిర్ధారించారు. చనిపోయిన పశువుపై కళేబరంపై విషం చల్లడంతో.. ఆ మాంసాన్ని తీన్న రెండు పులులు చనిపోయాయి. ఈ విషయాన్ని విచారణలో నిందితులు అంగీకరించిన్లు ఆసిఫాబాద్ డీఎఫ్వో నీరజ్ కుమార్ టేబ్రీవాల్ వెల్లడించారు. పశువులపై పులి దాడి చేస్తుందడం, వాటిని చంపేయడం సహించలేక పోయామని అన్నారని తెలిపారు. ఎలాగైనా పులులను చంపేందుకు ప్లాన్ వేశామన్నారు. అందుకే పులులను విషం పెట్టి చంపినట్లు తెలిపారు. దీనికి సంబంధించిన ఆధారాలును సైతం తాము సేకరించామని చెప్పారు. ఈ మేరకు సదరు వ్యక్తులను శుక్రవారం కోర్టులో హాజరు పరిసచినట్లు వెల్లడించారు. వీరిలో గంగు, జలపతికి న్యాయస్థానం 12 రోజుల జుడీషియల్ కస్టడీ విధించినట్లు తెలిపారు. ముగ్గురిలో మైనర్‌ను పేరెంటల్ బాండ్ పై రిలీజ్ చేసిందన్నారు. పులులు మృతి ఘటనపై ఇంకా విచారణ కొనసాగుతుందని తెలిపారు. ఇంకా పూర్తిస్థాయి సమాచారం తర్వాత వెల్లడిస్తామని డీఎఫ్ వో వెల్లడించారు.
Arvind Kejriwal: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో మరోసారి అరవింద్ కేజ్రీవాల్‌కు నోటీసులు