తెలంగాణ రాష్ట్రంలో ఒమిక్రాన్ వేరియంట్ కేసులు క్రమ క్రమంగా పెరిగి పోతున్నాయి. తెలంగాణ రాష్ట్రం లో కొత్తగా 3 ఒమిక్రాన్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో తెలంగాణ రాష్ట్రంలో 41 కి ఒమిక్రాన్ కేసుల సంఖ్య చేరింది. ఇవాళ ఒమిక్రాన్ వచ్చిన ముగ్గురు వ్యక్తులు… విదేశాల నుంచి వచ్చిన వారే కావడం గమనార్హం. అయితే.. ఈ ముగ్గురు ఇంకా ఎవరినైనా కలిసారా.. అనే దానిపై వైద్య అధికారులు ఆరా తీసుకున్నారు.
ఇది ఇలా ఉండగా..తెలంగాణ రాష్ట్రంలో న్యూ ఇయర్ వేడుకల పై ఆంక్షలు విధించింది కేసీఆర్ సర్కార్. హై కోర్టు ఆదేశాలతో ఆంక్షలు విధించింది తెలంగాణ ప్రభుత్వం. ఇవాళ్టి నుంచే జనవరి 2వ వరకు ఆంక్షలు అమలు కానున్నాయి. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది కేసీఆర్ సర్కార్. డిసెంబర్ 31 నుండి జనవరి 2 వరకు ర్యాలీ లు , బహిరంగ సభలు నిషేధిస్తూ… ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం.
