Site icon NTV Telugu

తెలంగాణలో కొత్తగా మూడు ఒమిక్రాన్ కేసులు

తెలంగాణ రాష్ట్రంలో ఒమిక్రాన్ వేరియంట్ కేసులు క్రమ క్ర‌మంగా పెరిగి పోతున్నాయి. తెలంగాణ రాష్ట్రం లో కొత్త‌గా 3 ఒమిక్రాన్ కేసులు న‌మోదు అయ్యాయి. దీంతో తెలంగాణ రాష్ట్రంలో 44 కి ఒమిక్రాన్ కేసుల సంఖ్య చేరింది. ఇందులో రెండు నాన్ రిస్క్ దేశాల నుండి వచ్చిన కేసులు కాగా… ఒకటి ఒమిక్రాన్ పేషేంట్ కాంటాక్ట్ లో మ‌రో కేసు నమోదు అయింది. ఇక ప్ర‌స్తుతం తెలంగాణ రాష్ట్రంలో యాక్టివ్‌ ఒమిక్రాన్ కేసులు సంఖ్య 34 గా న‌మోదు అయింది.

https://ntvtelugu.com/achennaidu-setairs-on-ap-govt/

ఇది ఇలా ఉండ‌గా..తెలంగాణ రాష్ట్రంలో న్యూ ఇయర్‌ వేడుకల పై ఆంక్షలు విధించిన సంగ‌తి తెలిసిందే. హై కోర్టు ఆదేశాలతో ఆంక్షలు విధించింది తెలంగాణ ప్రభుత్వం. నిన్న‌ నుంచి జనవరి 2వ‌ వరకు ఆంక్షలు అమలు కానున్నాయి. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది కేసీఆర్‌ సర్కార్. డిసెంబర్ 31 నుండి జనవరి 2 వరకు ర్యాలీ లు , బహిరంగ సభలు నిషేధిస్తూ… ఉత్త‌ర్వులు జారీ చేసింది ప్ర‌భుత్వం.

Exit mobile version