Site icon NTV Telugu

మంత్రి ఎర్రబెల్లికి తప్పిన ముప్పు.. కారు పూర్తిగా ధ్వంసం..!

Errabelli Dayakar Rao

Errabelli Dayakar Rao

తెలంగాణ గ్రామీణాభివృద్ధి పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకు పెను ప్రమాదమే తప్పింది… మంత్రి ఎర్రబెల్లి ప్రయాణిస్తున్న వాహనాన్ని ట్రాక్టర్‌ ఢీకొట్టింది… ట్రాక్టర్‌ దమ్ము చక్రాలు ఎర్రబెల్లి వాహనానికి తగిలాయి.. దీంతో.. ఎర్రబెల్లి వాహనం పూర్తిగా ధ్వంసమైనట్టుగా తెలుస్తోంది… మహబూబాబాద్‌ జిల్లా వెలిశాల-కొడకండ్ల మధ్య ఈ ఘటన జరిగింది.. ఈ ప్రమాదం నుంచి క్షేమంగా బయటపడ్డారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు… ఈ ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

Exit mobile version