Thota Chandrashekar: నాలుగు వేల కోట్ల విలువైన మియాపూర్ భూములను సీఎం కేసీఆర్ ధారాదత్తం చేశారని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు తనపై చేసిన ఆరోపణలకు ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ కౌంటర్ ఇచ్చారు. ఖమ్మంలో బీఆర్‌ఎస్ పార్టీ బహిరంగ సభ నుంచి మీడియా దృష్టి మరల్చేందుకు తనపై పనికిమాలిన ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ ఆరోపణలు నిజమైతే ఆ సర్వే నంబర్‌లోని 90 శాతం మీరే తీసుకోవాలని, మిగిలిన 10 శాతం తనకిస్తే చాలన్నారు. ఇలాంటి చిల్లర రాజకీయాలు, నిరాధార ఆరోపణలు మానుకోవాలని తోట చంద్రశేఖర్ అన్నారు. కేసీఆర్ సారథ్యంలోని బీఆర్ఎస్ పార్టీ దేశ భవిష్యత్ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తుందని చంద్రశేఖర్ పేర్కొన్నారు. తెలంగాణ మోడల్‌ను దేశవ్యాప్తంగా అమలు చేసేందుకే కేసీఆర్ బీఆర్‌ఎస్ పార్టీని స్థాపించారన్నారు. ఏపీతో పాటు తెలంగాణ ప్రగతిని దేశానికి పరిచయం చేస్తామన్నారు. త్వరలో విశాఖలో బీఆర్‌ఎస్ బహిరంగ సభను కేసీఆర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యేందుకు సన్నాహాలు చేస్తున్నామని తోట చంద్రశేఖర్ వెల్లడించారు.
Read also: Sridevi First Husband: శ్రీదేవి మొదటి భర్తని ఎందుకో వదిలేసిందో తెలుసా?
మియాపూర్ లాండ్ లో అనేక అవకతవకలు జరిగాయని ఆరోపించారు. సీఎం ముగ్గురు సబ్ రిజిస్ట్రార్ ల పై చర్యలు తీసుకున్నారని తెలిపారు. సీఎం బిహారీ… ఇది ఆంధ్రోళ్లు చెప్పారు. ఆయనకు బీహార్ కు చెందిన సోమేశ్ మీద ప్రేమ ఎక్కువ అని ఎద్దేవ చేశారు. BRS అంటే బీహార్ రాష్ట్ర సమితి అంటూ వ్యాఖ్యానించారు. నేటి ఖమ్మం సభకు డబ్బులు ఎక్కడి నుండి వస్తున్నాయని ప్రశ్నించారు. మియాపూర్ భూములు మీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడికి ఎలా కట్ట బెడుతున్నారు? అని ప్రశ్నించారు. ఈవిషయమై నేటిసభలో చెబితే బాగుంటుందని తెలిపారు. హాఫిజ్ పేట్ లోని 78 సర్వే నంబర్ భూములను తనఖా పెట్టీ ఎంబీఎస్ జువెలర్స్ సుఖేశ్ గుప్తా లోన్ తీసుకున్నారన్నారు. ఆ భూమిని అమ్ముకోవచ్చని కోర్ట్ తీర్పు ఇచ్చిందని స్పష్టం చేశారు. దీనికి వ్యతిరేకంగా ఈ 7ఎకరాల కోసం రంగారెడ్డి జిల్లా కలెక్టర్ సుప్రీం కోర్టులో slp వేశారని గుర్తుచేశారు. ఇక్కడ కనిపించని మరో కోణం తోట చంద్రశేఖర్ కోణం అంటూ వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తు్న్నాయి.
Read also:Yadagirigutta: లక్ష్మీనరసింహ స్వామి సన్నిధిలో నలుగురు సీఎంలు
ఇదే సర్వే నంబర్ లో 40 ఎకరాల భూమి ఆదిత్య కంపెనీ మీద తోట చంద్రశేఖర్ కొనుగోలు చేశారని అన్నారు. ఈ అంశంపై సుప్రీం కోర్టులో అప్పీల్ కు కలెక్టర్ ఎందుకు వెళ్ళడం లేదని ప్రశ్నించారు. 4 వేల కోట్ల తెలంగాణ ఆస్తులను ఒక ఆంధ్ర కాంట్రాక్టర్ కు కట్ట బెడుతున్నారని ఆరోపించారు. తోట చంద్రశేఖర్ చేత BRS సభకు ఖర్చు పెట్టుస్తున్నారని ఆరోపణలు గుప్పించారు. క్విడ్ ప్రో కో జరుగుతుందని అన్నారు. సుప్రీం కోర్టుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తామని తెలిపారు. ప్రమోటి ఐఏఎస్ లను హైదరాబాద్ చుట్టుపక్కల జిల్లాల కు కలెక్టర్ లుగా నియమించారని అన్నారు. భూ దందా కోసమే వారిని నియమించారని ఆరోపణలు గుప్పించారు రఘునందన్ రావు.
IT Rides Again: మరోసారి ఐటీ దాడులు కలకలం.. 30 టీములుగా..