Site icon NTV Telugu

Errabelli Dayakar Rao: ఎన్టీఆర్‌ మిమ్మల్ని చూసి నేర్చుకోండి అని మాపై కోప్పడే వారు

Errabelli Dayakar Rao

Errabelli Dayakar Rao

Errabelli dayaker Rao: స్పీకర్ పోచారం శ్రీనివాస్‌ రెడ్డికి రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. మీరు నేను కలిసి పని చేశామని గుర్తుకు చేసుకున్నారు. ఇద్దరం పార్టీ అధ్యక్షుడుగా చేశామన్నారు. పోటీ పడి సభ్యత్వం చేసే వారిమంటూ అన్నారు. ఎన్టీఆర్‌ మిమ్మల్ని చూసి నేర్చుకోండి అని మాపై కోపం పడే వారన్నారు. అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు గువ్వల బాలరాజు, పద్మాదేవేందర్ రెడ్డి, జాజుల సురేందర్, జాఫర్ హుస్సేన్, దానం నాగేందర్ అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు. త్వరలో మిగిలిపోయిన పెన్షన్లు ఇస్తామన్నారు. కొత్త పెన్షన్లు దాదాపు పూర్తి అయ్యాయని స్పష్టం చేశారు.

Read also: Jagga Reddy: నా లైఫ్ ఇంకా ముత్యాల ముగ్గు హీరోయిన్ లాంటిదే..!

అంతేకాకుండా.. తెలంగాణలో అర్హులైన లబ్ధిదారులందరికీ ఆసరా పెన్షన్లు ఇస్తున్నామని వెల్లడించారు. ఇక.. దేశంలో ఎక్కడా లేని విధంగా పెన్షన్లు ఇస్తున్నామని వెల్లడించారు. అయితే.. సాఫ్ట్ వేర్ సమస్యల వల్ల పెన్షన్లకు ఇబ్బంది వస్తున్న చోట సమస్యను పరిష్కారిస్తుమని పేర్కొన్నారు. కాగా.. ఎక్కడా కూడా ట్రాక్టర్, కారు చూసి పెన్షన్లు ఆపడం లేదని, వారి ఆర్థిక పరిస్థితిని బట్టే పెన్షన్లు అందజేస్తున్నామని తెలిపారు. ఇక.. దివ్యాంగులకు నెలనెలా మరిన్ని సదరం క్యాంపులు పెట్టే ప్రయత్నం చేస్తామని, ఈ ఆర్ధిక సంవత్సరంలో 9,08,498 మందికి కొత్తగా పెన్షన్లు ఇస్తున్నామన్నారు. ఇక.. ఉమ్మడి రాష్ట్రంలో సంవత్సరానికి పెన్షన్ల కోసం రూ. 861 కోట్లు ఇవ్వగా ప్రస్తుతం తెలంగాణలో రూ. 12వేల కోట్ల ను బడ్జెట్లో కేటాయించామని, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో గ్రామంలో వెయ్యి మంది ఉంటే 60, 70 మందికి మాత్రమే పెన్షన్లు అందుతున్నాయని వెల్లడించారు. ఇక.. తెలంగాణలో వెయ్యి మందికి గ్రామంలో ఆరు వందల నుంచి ఏడువందల మందికి పెన్షన్లు ఇస్తున్నామన్నారు.
MLA Redya Naik: హైదరాబాద్ లో నాకు భూమి ఉన్నట్లు నిరూపిస్తే.. రాజకీయ సన్యాసం తీసుకుంటా

Exit mobile version