NTV Telugu Site icon

Telangana Congress: మూడోరోజు థాక్రే పర్యటన.. ఇవాళ్టి షెడ్యూల్‌ ఇదే..

Third Day Manik Rao Thackeray

Third Day Manik Rao Thackeray

Telangana Congress: తెలంగాణలో ఏఐసీసీ ఇంచార్జి మాణిక్ రావ్ థాక్రే పర్యటన మూడో రోజు కొనసాగుతుంది. ఈరోజు గాంధీభవన్ మహిళా కాంగ్రెస్‌లో ఎస్‌యూఐ, యూత్ కాంగ్రెస్ కార్యవర్గాలతో ఎన్‌.ఏఐసీసీ ఇన్‌చార్జి మాణిక్‌రావు ఠాక్రే, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి సమావేశం కానున్నారు. ఇవాళ ఉదయం కొందరు ముఖ్య నేతలతో వ్యక్తిగత సమావేశాలు జరగనున్నాయి. అనంతరం ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు ఎల్బీ స్టేడియంలో జరుగుతున్న క్రికెట్ మ్యాచ్‌ను వీక్షిస్తారు. అక్కడి నుంచి సాయంత్రం నాగర్ కర్నూల్ లో జరిగే దళిత, గిరిజన ఆత్మగౌరవ సభలో పాల్గొంటారు.

Read also: Gold Price: బాబోయ్ బంగారం.. కొండ మీదే ఉన్న పసిడి

నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లిలో మార్కండేయ ప్రాజెక్టు నిర్మిస్తామని హామీ ఇచ్చి మట్టిని తీయలేదని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఈ ప్రాజెక్టును పరిశీలించేందుకు వెళ్లిన నాగం జనార్థన్‌పై బీఆర్‌ఎస్‌ నేతలు దాడి చేయడం నిన్నటి సమావేశంలో చర్చనీయాంశమైంది. అంతేకాదు బాధితులపై ఎస్సీ, ఎస్టీ కేసులను ఖండించారు రేవంత్‌.. మహిళా సర్పంచ్ ను దూషించినందుకు నాగం జనార్దన్ రెడ్డిపై కేసు పెట్టారని, నాగం తనను అవమానించలేదని మహిళా సర్పంచ్ డీఐజీకి వాంగ్మూలం ఇచ్చారని తెలిపారు. ఈ విషయమై డీజీపీకి, ముఖ్య నేతలకు కూడా ఫిర్యాదు చేసినట్లు సమాచారం. అయినా ప్రభుత్వం తన తప్పును సరిదిద్దుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకే ప్రభుత్వానికి అవగాహన కల్పించేందుకు ఇవాళ (ఆదివారం) నాగర్ కర్నూల్ లో దళిత గిరిజన ఆత్మగౌరవ సభ నిర్వహిస్తున్నారు. ఈ సమావేశానికి ఇన్‌చార్జి మాణిక్‌రావు ఠాక్రేతో పాటు ముఖ్య నేతలంతా హాజరుకానున్నారు.
Republic Day TerrorAttack: ఎర్రకోటపై ఖలిస్తాన్ జెండాను ఎగురవేస్తే 5లక్షల డాలర్లు ఇస్తా ఎస్‌ఎఫ్‌జే ప్రకటన