There Was A Scam In Telangana Than Delhi Liquor Scam Says Boora Narsaiah Goud: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్‌కి మించిన కుంభకోణం తెలంగాణలో జరిగిందని మాజీ ఎంపీ, బీజేపీ నేత బూర నర్సయ్య గౌడ్ సంచలన ఆరోపణలు చేశారు. త్వరలోనే ఆ కుంభకోణాన్ని ఆధారాలతో సహా బయటపెడతానని పేర్కొన్నారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ.. ఫారిన్ లిక్కర్ సేల్స్ ద్వారా తెలంగాణలో ఒక వ్యక్తికి వందల కోట్ల లబ్ది చేకూరుతోందని ఆరోపించారు. ఫారిన్ లిక్కర్ పాలసీకి ఐదేళ్ల కాలపరిమితి ఇవ్వటానికి కారణాలేంటో తేల్చాలని డిమాండ్ చేసిన ఆయన.. ఫారిన్ లిక్కర్ టెండర్‌కు కేవలం 24 గంటల సమయమే ఎందుకు ఇచ్చారు? అని ప్రశ్నించారు. టెండర్‌లో కేవలం ఒక్క అప్లికేషన్ మాత్రమే ఎందుకొచ్చింది? అని నిలదీశారు. హైదరాబాద్‌లో ఒక వైన్స్‌లో రోజుకు రూ.1 కోటి అమ్మకాలు జరుగుతున్నాయని, ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం ఒక ప్రైవేట్ వ్యక్తికి వెళ్తోందని చెప్పారు. ఆ షాపుతో పాటు వ్యక్తి పేర్లను త్వరలోనే బయటపెడతానని మాజీ ఎంపీ వెల్లడించారు.
KS Bharath: కేఎస్ భరత్ వద్దు.. అతడే సరైనోడు.. టీమిండియా దిగ్గజం సంచలన వ్యాఖ్యలు
అంతకుముందు.. బీఆర్ఎస్ ఉద్యమ ద్రోహుల పార్టీగా మారిందని బూర నర్సయ్య వ్యాఖ్యానించారు. కేసీఆర్‌ది నిరంకుశ పాలన అని మండిపడ్డ ఆయన.. బీఆర్ఎస్‌లో ప్రజాస్వామ్యం లేదని, వ్యక్తిస్వామ్యం మాత్రమే ఉందని ఆరోపించారు. అభిమానం అంటే బానిసత్వమని కేసీఆర్ అనుకుంటున్నారని.. తెలంగాణ ప్రజలు ఎప్పుడు బానిసలు కారని అన్నారు. కేసీఆర్కు ఓట్లు, సీట్లు, నోట్లు మాత్రమే కావాలని విమర్శించారు. తెలంగాణ వచ్చాకే నల్గొండ జిల్లాలో ఫ్లోరోసిస్ పోయిందంటూ బీఆర్ఎస్ నేతలు డబ్బా కొట్టుకుంటున్నారని.. మరి ఫ్లోరైడ్ అంతమైతే, ఫ్లోరోసిస్ రిసెర్చ్ సెంటర్ ఎందుకని ప్రశ్నించారు. రాజస్థాన్లో తక్కువ ఖర్చుతోనే ఫ్లోరైడ్ను నిర్మూలించారని, దీనిపై బీఆర్ఎస్ మంత్రులు చర్చకు రావాలని సవాల్ విసిరారు. తక్కువ ఖర్చులతో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదీ చేయదని, మనమంతా మెగా ప్రాజెక్టులే కదా అని ఎద్దేవా చేశారు.
Salman Khan: ఆ సమయంలో సల్మాన్ డబ్బులు ఆఫర్ చేశాడు.. గ్యాంగ్‌స్టర్ బిష్ణోవ్ బాంబ్