Site icon NTV Telugu

Hyderabad:మహానగరంలో మాయగాళ్లు.. శ్మశానంలోనూ చోరీ

Theef

Theef

చాంద్రాయణగుట్ట నల్లవాగు శ్మశానవాటికలో అర్ధరాత్రి చోరీ జరిగింది. 30వేల నగదును శ్మశాన వాటిక కార్యాలయం నుంచి దొంగలు ఎత్తుకెళ్లారు. శ్మశాన వాటిక నిర్వహకులు పోలీసులకు సమాచారం అందించారు. ఇటీవలే ఓ అంత్యక్రియల కోసం శ్మశాన వాటిక నిర్వాహకులు డిపాజిట్ చేసిన 30 వేల నగదు మాయమైంది. దీంతో చంద్రయాన్ గుట్ట పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

సిబ్బంది తెలిపిన వివ‌రాలు ప్ర‌కారం.. హైదరాబాద్ పాతబస్తీ చంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని గల నల్లవాగు స్మశాన వాటిక బొందల గడ్డ లో కొంద‌రు మాయగాళ్లు చోరీకి య‌త్నించారు. ప్రతి రోజు రద్దిగా ఉండే నల్లవాగు స్మశాన వాటికలో నిన్న (మంగ‌ళ‌వారం) పలు మృత దేహాలకు దహన సంస్కారణాలు జరిపి ప్రధాన ద్వారానికి తాళాలు వేసి వెళ్లిపోయిన సిబ్బంది.

రాత్రి సమయంలో స్మశాన వాటికలో కొంద‌రు కేటుగాళ్లు చోరీకీ పాల్పడ్డారు. 30వేల రూపాయల నగదు. 30వేల డీజిల్ 10వేల బ్యాండ్ సామాను.10వేల రూపాయల దహన సంస్కారాలు జరిపే ఇత్త‌డి సామాన్లు, మరియు విలువైన వస్తువులను ఎత్తుకెల్లారు. దీంతో తెల్ల‌వారు జామున వచ్చిన సిబ్బంది చోరీ జ‌రిన‌ట్లు గ‌మ‌నించారు. సిబ్బంది ఖంగుతిన్నారు. నిఘా లోపం సీసీ కెమెరాలు ఉన్న ప‌నిచేయ‌క పోవ‌డంతో దొంగ‌లు దొర‌ల్లా వ‌చ్చి దొంగ‌త‌నం చేశార‌ని తెలిపారు. తాళాలు ప‌గ‌ల గొట్టి ప‌లుమార్లు దొంగ‌త‌నాలు జరిగా పోలీసులు ప‌ట్టించుకోలేద‌ని వాపోయారు స్మశాన వాటిక సిబ్బంది. చంద్రయాణాగుట్ట పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేప‌ట్టారు.

అయితే ఇటీవలే కాలంలో .. సోమవారం (May 16, 2022)న జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. జవహర్ నగర్ కాలనీలో ఒకే రోజు రెండు ఇళ్ళలో చోరీకి పాల్పడి అందిన కాడికి దోచుకెళ్ళారు. స్థానికంగా నివాసం ఉంటున్న నర్సింగోజు శ్రీనివాస్ కుటుంబ సభ్యులతో వివాహ వేడుకకు వెళ్లి వచ్చి చూసే సరికి బిరువ తాలలు పగల గొట్టి 30తులాల వెండి, 3గ్రాముల బంగారం, 5వేల నగదు ఎత్తుకెళ్లగా, అదే కాలనికి చెందిన నెరుపటి శ్రీనివాస్ ఇంట్లో లేని సమయంలో తులం నర బంగారం, 20వేల నగదును దొంగలు ఎత్తుకెళ్లడం తో బాధితులు లబోదిబోమంటు పోలీసులను ఆశ్రయించారు.

Ram Charan: ఆ ప్రాజెక్ట్ ఏమైంది..?

Exit mobile version