NTV Telugu Site icon

Siddipet: సిద్దిపేట మహిళా డిగ్రీ కాలేజీలో చోరీ.. కంప్యూటర్లు ఎత్తుకెళ్లిన దొంగలు

Siddipet

Siddipet

Siddipet: సిద్దిపేట జిల్లా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పట్టపగలు చోరీ తీవ్ర కలకం రేపింది. ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో దొంగలు చొరబడ్డారు. కంప్యూటర్లు, మానిటర్లు, ప్రింటర్లు వంటి విలువైన వస్తువులు ఎత్తుకెళ్లారు. ఈ ఘటన సిద్దిపేట జిల్లాలో సంచలనంగా మారింది.

Read also: Raja Singh: సచివాలయంలో మీటింగ్ అని పిలిస్తేనే వచ్చా.. ఎందుకు అడ్డుకుంటున్నారు

సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో దొంగలు చొరబడ్డారు. తాళాలు పగులగొట్టి డిగ్రీ కళాశాలలోకి ప్రవేశించారు. కళాశాలలోని ఒక కంప్యూటర్, మూడు మానిటర్లు, ఒక ప్రింటర్ ఎత్తుకెళ్లారు. ఈ చోరీపై ప్రభుత్వ డిగ్రీ మహిళా కళాశాల ప్రిన్సిపాల్ స్పందించారు. ఉదయం కళాశాలకు రాగానే తాళం పగులగొట్టి ఉండటం గమనించామని తెలిపారు. తాళం పగులగొట్టి లోపలికి వెళ్లి కంప్యూటర్లు, మానిటర్లు, ప్రింటర్లను ఎత్తుకెళ్లారని తెలిపారు. ఈ చోరీపై కళాశాల ప్రిన్సిపాల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో వెంటనే స్పందించిన పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని చోరీపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కళాశాలలోని సీసీ కెమెరాలను పరిశీలించారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా దొంగలను గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారని తెలిపారు. దొంగల కోసం పరిసర ప్రాంతాల్లో పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారని అన్నారు. అయితే కంప్యూటర్‌లోని కాలేజీకి సంబంధించిన విలువైన డేటా చోరీకి గురైనట్లు తెలుస్తోంది. ప్రభుత్వ మహిళా కళాశాలలో చోరీ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. మహిళా కళాశాలలో చోరీ చేయడం ఏంటని ప్రజలు మండిపడుతున్నారు. అధికారులు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని కోరుతున్నారు.
Jabardasth Varsha : ఇంత ఎర్రగా ఉంటే ఎలా పాప.. కుర్రాళ్లు ఊరుకుంటారా