NTV Telugu Site icon

Lorry Thief: ఏకంగా లారీనే ఎత్తుకెల్లారు.. ఇప్పటికి మూడు మాయం

Lorry Thief

Lorry Thief

Lorry Thief: వింత ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. దొంగతనం అంటే నగలు దొంగతనం చేయడం, ఇంట్లో వున్నదంతా దోచుకుపోవడం పలు వెరైటీ వింత దొంగతనాలు వింటూ వుంటాము. మొన్నటికొ మొన్న ఇంట్లో చోరీకి వచ్చిన దొంగ కిచెన్‌ రూమ్‌ లో వెళ్లి పాలు వేడి చేసుకుని తాగి మళ్లీ అవి కడిగి అక్కడే పెట్టేసి వెళ్లిన ఘటన చూశాం. మరొక దొంగ అయితే ఏకంటా ఆర్టీసీ బస్సునే దొంగతనం చేసిన ఘటన హాస్యాస్పదంగా మారింది. దొంగలు అసలు ఏం టార్గెట్‌ చేస్తున్నారో అర్థం కాని ఆయోమయంలో పడిపోయారు పోలీసులు బాసులు. పోలీసుల మైండ్ కే పదును పెట్టే విధంగా రవితేజ మూవీ ఇడియట్‌ లో ఆలీ చేసిన బైక్‌ దొంగతనాలు కడుపుబ్బా నవ్విస్తుంటాయి. ఇసుక అంటూ బైక్‌ దొంగతనాలకు పాల్పడుతూ రాష్ట్రాలకు బైక్ దాటిస్తుంటాడు. చివరకు పోలీసే అనుమానంతో దొంగకు ఏదో చేస్తున్నావ్‌ అది ఏంది అని అంతుచిక్కడం లేదంటూ దొంగగా నటించిన ఆలీని అడుగగా బైక్‌ దొంగతనాలు చేస్తుంటాను అంటూ చెప్పి అక్కడనుంచి పరారయ్యే సీన్‌ ఇడియట్‌ మూవీలో హైలెట్‌ అనే చెప్పాలి. ఇక్కడ ఓదొంగ లారీలనే టార్గెట్‌ చేశాడు. బస్టాండ్‌ దగ్గర లారీ నిలిచి ఉండటం చూసాడే అది మాయం అవ్వాల్సిందే. ఏకంగా మూడు లారీలనే ఎత్తుకెళ్లాడు. ఈఘటన కొమరం భీం జిల్లాలో చోటుచేసుకుంది.

Read also: China Sheep Mystery : గుండ్రంగా తిరుగుతున్న గొర్రెలమంద.. సైంటిస్టులకే సవాల్

కొమరంభీం జిల్లా కాగజ్‌నగర్‌ పట్టణంలో లారీల దొంగతనం కలకలం రేపుతోంది. బస్ స్టాండ్ సమీపంలో నిలిపి ఉంచిన లారీని కొందరు దొంగలు ఎత్తు కెళ్లారు. ఒకటి కాదు రెండు ఏకంగా ఇప్పటి వరకు ఇలా 3 లారీలు చోరీకి పాల్పడ్డారు. బస్ స్టాండ్ సమీపంలో లారీని నిలబెట్టి టిఫెన్‌ తినడానికో లేక, ఇతర కారణాల వల్లో లారీని అక్కడ ఆపి వెళ్లామో ఇక లారీని మరిచిపోవాల్సిందే. ఓ లారీ డ్రైవర్‌ కాగజ్‌ నగర్‌ బస్ స్టాండ్ లో తన లారీని నిలబెట్టి వేరేచోటుకు వెళ్లాడు. ఆపని ముగించుకుని వచ్చి చూడగా లారీ మాయమైంది. దీంతో నిర్ఘాంత పోయిన లారీ డ్రైవర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తులో భాగంగా అక్కడు సీసీ కెమెరాలను పరిశీలించారు. సీసీ కెమెరాల్లో రికార్డు అయిన దృశ్యాలు చూసి షాక్‌ తిన్నారు. ఇక్కడ లారీని చోరి చేసి సిర్పూర్ టి బార్డర్ దాటిస్తున్నండగా సీసీ కెమెరాలో లారీ దృశ్యాలు రికార్డయ్యాయి. పోలీసులకు దీని నిఘా పెట్టామని లారీ దొంగలను వెంటనే పట్టుకుంటామని చెబుతున్నారు.
Shraddha Case: ఇదే పని హిందువులు చేసుంటే..? స్వామీజీ వివాదాస్పద వ్యాఖ్యలు