permission to munawar faruqui comedy show in hyderabad: ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న మునావర్ ఫారుఖీ కామెడీ షోకు ఎట్టకేలకు అనుమతి లభించింది. రేపు హైటెక్స్‌లో మునావర్ ఫారుఖీ కామెడీ షో నిర్వహించేందుకు అభిమానులు సన్నాహాలు మొదలయ్యాయి. కొద్దిరోజులుగా మునావర్ షారూఖీ షో హైదరాబాద్ లో నిర్వహించకూడదని.. షోను అడ్డుకుంటామని, వేదికను తగలబెడతామని వార్నింగ్ ఇచ్చిన బీజేపీ శ్రేణులు హెచ్చిరించిన విషయం తెలిసిందే. అయినా కూడా మునావర్ షోను హైదరాబాద్ లో నిర్వహించేందుకు పరిమిషన్ లభించడంతో.. టెన్షన్ మొదలైంది.
బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఇంటి వద్ద పోలీసులు బందోబస్త్:
రాజాంగ్ మునావర్ షోను అడ్డుకుంటామని, వేదికను తగలపెడతామని ప్రకటించడంతో.. పోలీసులు రాజాసింగ్ ఇంటి వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. రేపు మునావర్ ఫరూఖీ హైదరాబాద్ షో నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగా రాజాసింగ్ బయటకు వెళ్లకుండా ఇంటి వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు.
మునవార్ ఫారుఖీ.. ఇతనొక స్టాండప్ కమెడియన్. ఎప్పుడైతే కంగనా రనౌత్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న ‘లాకప్’ షోలో అడుగుపెట్టాడో, అప్పట్నుంచి అతని దశ తిరిగిపోయింది. ఆ షోలో తనదైన కామిక్ టైమింగ్, కవిత్వాలతో అందరి మనసులు దోచాడు. అందుకే, ఆ షో విన్నర్‌గా నిలిచాడు. ఇప్పుడు అతను హైదరాబాద్‌కి రాబోతున్నాడు. ఈనెల 20వ తేదీన ‘డోంగ్రీ టు నోవేర్’ పేరుతో ఓ లైవ్ షో ఏర్పాటు చేస్తున్నట్లు ఈ విషయాన్ని ఫారుఖీ ఇన్‌స్టాగ్రామ్ మాధ్యమంగా వెల్లడించిన విషయం తెలిసిందే.. అయితే దీనిపై సర్వత్రా ఉత్కంఠంగా మారింది. ఈఫారుఖీ షోను అనుమతి ఇవ్వొద్దంటూ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్, బీజేవైఎం నాయకులు హెచ్చరించారు.
హిందువు దేవుళ్లను కించపరిచే విధంగా షో లో వాఖ్యలు ఉంటాయని పిర్యాదు చేశారు. ఈ షో ద్వారా హిందువులకు వ్యతిరేకంగా.. కమ్యునల్ ఇష్యూ జరుగుతుందని పిర్యాదు చేశారు. ఈఫారుఖీ షోను అనుమస్తే వేదికను తగలబెడతామని వార్నింగ్ ఇచ్చిన విషయం తెలిసిందే.. అతడ్ని ఎవరైనా సహకరిస్తే, వాళ్లు తీవ్ర పరిణామాలు ఎదుర్కోక తప్పదని తేల్చి చెప్పారు. గతంలో ఓ కార్యక్రమంలో భాగంగా సీతాదేవిపై ఫారుఖీ జోకులు వేసినందుకు వివాదాస్పదమైంది. కర్ణాటకలో అతడ్ని బ్యాన్ చేశారు. అందుకే, హైదరాబాద్‌లోనూ అతడి షోలు నిర్వహించకూడదని రాజాసింగ్ కోరుతున్నారు. అయితే ఇన్ని వివాదాస్పదలు ఎదురవుతున్నా.. ఫారూఖీ షోను అనుమతించడంతో సర్వత్రా ఉత్కంఠ చోటుచేసుకుంది. షారూఖీ షోలో ఎటువంటి అవాంత సంఘటనలు జరగకుండా చూసుకునేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. ^
Vishaka East Politics : ఆ నియోజకవర్గం వైసీపీలో టెన్షన్