Site icon NTV Telugu

తెలంగాణకు వర్ష సూచన.. అప్రమత్తమైన టీసర్కార్‌..

దక్షిణ అండమాన్‌ సముదంలో అల్పపీడనం ఏర్పడడంతో ఏపీ, తెలంగాణ, ఒడిశా, కర్ణాటక, తమిళనాడు, కోస్టల్‌ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురియనున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర వాతావరణ శాఖ ఆయా రాష్ట్రాలు హెచ్చరికలు జారీ చేసింది. దీంతో తెలంగాణ సర్కార్‌ అప్రమత్తమైంది.

రానున్న వర్షాల ప్రభావం ధాన్యం కొనుగోళ్లపై పడకుండా ఉండేందుకు చర్యలు చేపట్టింది. ధాన్యాన్ని వర్షాల నుంచి రక్షించేందుకు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించింది. 4,039 ధాన్యం కోనుగోలు కేంద్రాలలో యుద్ధప్రతిపాదికనగా వర్షం నుంచి ధాన్యాన్ని కాపాడేందుకు చర్యలు తీసుకోవాలని సూచించింది.

Exit mobile version