Site icon NTV Telugu

వీధి వ్యాపారులకు ప్రభుత్వం శుభవార్త

తెలంగాణ ప్రభుత్వం వీధి వ్యాపారులకు చేయూతనందించడం కోసం వారికి ఆర్థిక సాయం అందించాలని గతంలోనే ప్రతిపాదించింది. కాగా ఇప్పటికే మొదటి విడతలో చాలా మంది రూ.10వేలకు పైగా తీసుకున్నారు. పూర్తి స్థాయిలో రుణాలు చెల్లించిన వీధి వ్యాపారులకు రెండో విడత రుణాలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. తొలిదశలో రూ.10వేల రుణం చెల్లించిన వారికి రెండో విడతలో రూ.20వేల వరకు పంపిణీ చేయాలని ఇప్పించాలని నిర్ణయించింది.

Read Also:కర్ణాటకలో ఉద్రిక్తత.. శివాజీ, సంగూలి రాయన్న విగ్రహాల ధ్వంసం

ఈ రుణాలతో వారు ఆర్థికంగా ఎదగడమే కాకుండా వారి వ్యాపారాలను విస్తరించుకునేందుకు నూతన సరుకును సమకూర్చుకునేందుకు ఈ రుణాలు ఉపయోగపడతాయని ప్రభుత్వం భావిస్తుంది. అయితే దీని ద్వారా ఆయా మున్సిపాలిటీలకు ఆదాయ వనరుగాకూడా మారే అవకాశం ఉన్నందున్న వీధి వ్యాపారాల విస్తరణపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. దీన్లో భాగంగానే వారికి చేయూతనందించేందుకు ఈ రుణాలను మంజూరు చేస్తున్నారు. రుణాలు కావాల్సిన వారు మీసేవా కేంద్రాలు, మున్సిపల్‌ ఆఫీసు,ఫోన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు కాగా తొలిదశ రుణాల్లో దేశంలోనే అత్యధికంగా రుణాలు పంపిణీ చేసిన రాష్ట్రంగా తెలంగాణ నిలిలిచింది.

Exit mobile version