NTV Telugu Site icon

Tension in Laktikapool: టీచర్ల మౌన దీక్ష.. పిల్లలతో సహా అరెస్ట్

Tension In Laktikapool

Tension In Laktikapool

Tension in Laktikapool: సంవత్సరకాలంగా 13 జిల్లాల్లో ఉపాధ్యాయ దంపతుల బదిలీల కోసం ఎదురు చూస్తున్న స్పోజ్ ఉపాధ్యాయులు ఇవాళ డీఎస్సీ కార్యాలయం ముందు మౌన దీక్షకు దిగారు. వందలాదిగా తరలివచ్చిన ఉపాధ్యాయులు.. మౌనంగా తమ ఆవేదనను ప్రభుత్వానికి వివరించే ప్రయత్నం చేశారు. గడిచిన సంవత్సరంగా పెండింగ్లో ఉన్న తమ సమస్యను వెంటనే పరిష్కరించాలని, ప్రతిస్పౌస్ బాధితుడికి న్యాయం జరిగే వరకూ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. దంపతుల బదిలీలను బ్లాక్ చేసిన 13 జిల్లాల్లో 2100 మంది బాధితులు ఉండగా, అందులో 615 మందికి మాత్రమే స్పౌజ్ బదిలీలు జరుగుతున్నాయని, అది కూడా కేవలం కొద్ది మంది స్కూల్ అసిస్టెంట్లకు మాత్రమే అనుమతించి. ఎస్జిటి, పండిట్, పీఈటి ఇతర ఉపాధ్యాయ దంపతుల బదిలీలు జరగడంలేదని విస్తృత ప్రచారం జరుగుతుంది. అసలు ఏం జరుగుతుందో అర్థం కాక ఉపాధ్యాయ సంఘాల నాయకుల నుండి సరైన సమాధానం దొరకక ఆందోళనతో ఉపాధ్యాయ దంపతులు డీఎస్సీ కార్యాలయం ముందు మౌన దీక్ష చేపట్టారు.

Read also: Viral : తాగిన ఒక్క బీరుకు.. బారెడంత బిల్లు వేసి మత్తు దించిన పోలీసులు

హైదరాబాద్ లక్డికపుల్ లోని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ కార్యాలయం ముందు మౌన దీక్షకు ఉపాధ్యాయ స్పోస్ ఫోరమ్ పిలుపు నిచ్చింది. ఈనేపథ్యంలో.. హైదరాబాద్ లకుడికపూల్ లోని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ కార్యాలయం ముందు 13 జిల్లాల్లో బదిలీల కోసం ఆందోళన చేపట్టారు. దీంతో టీచర్లు వారిపిల్లలు మౌన దీక్ష ఉద్రిక్తంగా మారింది. కమిషనర్ కార్యాలయం చేరుకుంటున్న ఉపాధ్యాయులను ఎక్కడికక్కడ ఉపాధ్యాయ దంపతులను అరెస్ట్ చేస్తున్న పోలీసులు. ఈ ఆందోళనలో చిన్నారులపై సైతం పోలీసులు దారుణంగా అరెస్ట్ చేయడంతో.. తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బ్లాక్ లో ఉంచిన 13 జిల్లాల్లో 1656 మందికి దంపతుల బదిలీలు నిర్వహించేందుకు ఫైలు సిద్ధమైందని సమాచారం ఉన్నప్పటికీ, 615 మందికి మాత్రమే చేయాలనుకోవడం బాధాకరమని ఉపాధ్యాయులు ఆవేదన చెందారు. 30% మందికే దంపతుల బదిలీలు చేపట్టి, పూర్తిగా అవకాశం ఉన్న క్యాడర్లను పక్కకు పెట్టడం స్పౌజ్ బదిలీల కోసం ఎదురుచూస్తున్న కుటుంబాలలో ఆవేదన మిగిలిందని ఉపాధ్యాయులు వాపోయారు.

Read also: Modi Telangana Tour: తెలంగాణలో మోడీ పర్యటన.. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన

సంగారెడ్డి జిల్లాలో ఎస్జీటీ కేడర్ లో ముగ్గురు ఉపాధ్యాయులు మాత్రమే కౌజు బదిలీ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఆ జిల్లాలో 362 ఎస్ జి టి పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అంతేకాదు సూర్యాపేటలో 28 మంది ఎస్జీటీలలో బదిలీ కోసం అప్లై చేసుకోగా 252 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఖమ్మం జిల్లాలో కూడా 40 మంది ఎస్జీటీలు దంపతులు బదిలీల కోసం అర్జీ పెట్టుకోగా 341 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ప్రభుత్వం నిర్వహించనున్న ప్రమోషన్ల ప్రక్రియ ద్వారా కూడా వందల సంఖ్యలో ఖాళీలు ఏర్పడనున్నాయి. ఒకటి రెండు క్యాడర్ల మినహా మిగిలిన అన్ని జిల్లాల్లోనూ స్పౌజ్ అప్పీళ్ళు అన్నిటినీ క్లియర్ చేసే అవకాశం ఉందని, ఉపాధ్యాయుల ఆవేదన చెందారు. సంవత్సరం క్రితం 19 జిల్లాలకు ఇచ్చి,13 జిల్లాలను బ్లాక్లో ఉంచి వివక్షకులు చూపారని, ప్రమోషన్లు బదిలీల సందర్భంగా తమకు పరిష్కారం దొరుకుతుందని ఆశించిన ఉపాధ్యాయ దంపతులకు తీరని ఆవేదన మిగిల్చుతున్నారని వాపోయారు.

Read also: IT Rides in Aditya Homes: మూడవరోజు ఐటీ సోదాలు.. ఉద్యోగులపై చేయి చేసుకున్నారని ఆరోపణ

సీఎం కేసీఆర్ సార్ న్యాయం చేయండి

దంపతులు గడిచిన సంవత్సరం గా 13 జిల్లాల్లోని ఉపాధ్యాయ దంపతులు బదిలీల కోసం విద్యాశాఖ మంత్రి తో పాటు మంత్రులు, అధికారుల చుట్టూ తిరుగుతున్న. పిల్లాపాపలతో కుటుంబాలుగా జిల్లా కేంద్రాల్లో, హైదరాబాద్ లో, శాంతియుత కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. నిరంతరాయంగా ఎన్ని ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ ఉపాధ్యాయ దంపతులు బదిలీల ప్రక్రియ మాత్రం జరగడం లేదు. ప్రమోషన్లలో బదిలీ నిర్వహిస్తున్న ఈ తరుణంలో సీఎం కేసీఆర్ మాత్రమే తమ సమస్యకు పరిష్కారం చూపగలరని, మౌన దీక్ష ద్వారా ఉపాధ్యాయులు చేస్తున్న ఈ విన్నపాన్ని సహృదయంతో స్వీకరించి వెంటనే 13 జిల్లాల ఉపాధ్యాయ దంపతులు అందరికీ బదిలీలు జరిపించాలని వేడుకున్నారు.

Read also: Manikrao Thakre: రెండోరోజు థాక్రే పర్యటన.. నేడు గాంధీభవన్‌లో రేవంత్ పాదయాత్రపై చర్చ

రాష్ట్రపతి ఉత్తర్వులు 2018 ప్రకారం ఉపాధ్యాయులను జిల్లాల కేటాయింపు ప్రక్రియ 2021 డిసెంబర్లో జరిగింది. ఈ కేటాయింపులో భాగంగా భార్యాభర్తలైన ఉపాధ్యాయులను వారు కోరుకున్న జిల్లాల కేటాయించాలని ప్రభుత్వం మేము 1655 ప్రకారం స్పష్టంగా ఉంది. మేము 1655 ప్రకారం 19 జిల్లాల్లో ఉపాధ్యాయ దంపతులకు జరిపిన ప్రభుత్వం, మిగిలిన 13 జిల్లాలను బ్లాక్ లిస్టులో పెట్టింది. వందల కిలోమీటర్ల ప్రయాణం చేస్తూ, డ్యూటీలు చేస్తూ కష్టనష్టాలను పడుతున్న వారిలో 90 శాతం మంది మహిళా ఉపాధ్యాయులు ఉన్నారు. ఎక్కువ మందికి పది సంవత్సరాలు లోపు వయసున్న పిల్లలు ఉన్నారు. 25 సంవత్సరాల పైబడిన సర్వీసు ఉంది. ఈ పరిస్థితి , బాధ్యతలు విద్యాబోధనపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి. ప్రభుత్వం వారు పై విషయాలను పరిగణలు తీసుకుని వెంటనే 13 జిల్లాల్లో ఉపాధ్యాయ దంపతులకు బదిలీలు చేపట్టాలని ఉపాధ్యాయులు వేడుకుంటున్నారు. మరి దీనిపై తెలంగాణ ప్రభుత్వం ఎలా స్పందించనుంది అనే విషయమై ఉత్కంఠంగా మారింది.
Woman Died Violently: ఓయూలో ఆత్మహత్య కలకలం.. బిల్డింగ్‌పై నుంచి దూకిన యువతి