Secunderabad Crime: ఓ విద్యార్థి తనతో పాటు స్కూల్ కు సెల్‌ఫోన్ తెచ్చుకోవడంతో.. ప్రిన్సిపల్ తనను సస్పెండ్ చేశాడు. దీంతో తల్లిదండ్రులకు తెలిస్తే ఏమంటారో అనుకున్నాడో.. లేక విద్యార్థుల ముందు అవమానంగా భావించాడో తెలియదు.. మనస్తాపానికి గురైన ఆ స్టూడెంట్ చిరకు తనువు చాలించాడు. రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన సికింద్రాబాద్ లోని జీఆర్పీ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
రైల్వే ఇన్‌స్పక్టర్ శ్రీను మాట్లాడుతూ.. మృతి చెందిన విద్యార్థి మల్కాజ్‌గిరి ఆర్.కే. పురంలోని గాందీనగర్‌కు చెందిన కొండా దినేష్ రెడ్డిగా గుర్తించామని తెలిపారు.
Read also: Rayalaseema JAC: మూడు రాజధానులకు మద్దతుగా కర్నూలులో భారీ ర్యాలీ
దినేష్ ఏఓసీ సెంటర్ లోని ఆర్మీ పబ్లిక్ స్కూల్ లో 10వ తరగతి చదువుతున్నాడని తెలిపారు. సోమవారం దినేష్ రెడ్డి పాఠశాలకు సెల్‌ఫోన్ తీసుకెళ్లాడని, గమనించిన ప్రిన్సిపాల్ పద్మజ వెంటనే దినేష్‌ను మందలించి, 12 రోజుల పాటు సస్పెండ్ చేశారు. ఇదే విషయం విద్యార్థి తండ్రి రమణారెడ్డికి కూడా చెప్పి విద్యార్థిని అతడితోపాటు పంపారు. ఇంటికి వెళ్లిన దినేష్ రెడ్డి మనస్తాపానికి గురై నిన్న సాయంత్రం అమ్ముగూడ స్టేషన్ సమీపంలో రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. రైల్వే సిబ్బంది సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. మృతుడి కుటుంబ సభ్యులకు సమాచారం అందించి, పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Go Back Modi: ట్విట్టర్‌లో ట్రెండ్ అవుతున్న “గో బ్యాక్ మోదీ”
