Site icon NTV Telugu

తెలంగాణలో కొత్తగా 171 కరోనా కేసులు

రాష్ట్రంలో కొత్తగా 24 గంటల్లో 38,373 నిర్థారణ పరీక్షలు నిర్వహించగా కొత్తగా మరో 171 కేసులు నమోదయినట్టు వైద్యారోగ్య శాఖ ప్రకటించింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 6,71,000లకు చేరుకుంది. నిన్న కరోనాతో ఒకరు మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 3,952కు చేరింది. మహామ్మారి నుంచి నిన్న 208 మంది కోలుకున్నారు. తెలంగాణలో ప్రస్తుతం 4,126 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని వైద్యారోగ్య శాఖ తెలిపింది.

ప్రజలు నిర్లక్ష్యంగా వ్యవహరించకుండా కరోనా జాగ్రత్తలు పాటించాలని కోరింది. వచ్చే పండుగలను దృష్టిలో పెట్టుకుని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని గుంపులు గుంపులుగా ఒకే చోట చేరి కరోనా వ్యాప్తికి కారణం అవ్వొద్దన్నారు. డెల్టా వేరియంట్‌ వేగంగా విజృంభిస్తుందని అన్ని కరోనా జాగ్రత్తలతో పాటు స్వీయ నియంత్రణ అవసరమని వైద్యాఆరోగ్య శాఖ ప్రజలకు సూచించింది. డెల్టా వేరింయంట్‌ వేగంగా వ్యాప్తి చెందుతున్నందున్న అందరూ అప్రమత్తంగా ఉండాలని వైద్యాఆరోగ్యశాఖ ప్రజలను కోరింది.

Exit mobile version