Site icon NTV Telugu

Crime news: తండ్రి రెండో వివాహం.. సుత్తితో కొట్టిన చంపిన కొడుకు

Ramanthapur Crime

Ramanthapur Crime

Ramanthapur Crime: సమాజంలో మానవ సంబంధాలు, రక్త సంబంధాలకు అర్థం లేకుండా పోతుంది. కొడుకును పెంచి పోషించిన తండ్రిని చావుకు పంపిస్తున్న కసాయిల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. మానవ సమాజంలో రోజురోజుకూ నేరాలు రాజ్యమేలుతున్నాయి. నియంత్రణ లేకుండా ఎక్కడ చూసినా అఘాయిత్యాలు, హింసాత్మక ఘటనలు జరుగుతున్నాయి. రక్తసంబంధాలను సైతం మరిచి చిన్న చిన్న విషయాలకే దారుణ హత్యలకు పాల్పడుతున్న ఘటనలు కలకలం రేపుతున్నాయి.

Read also: TSPSC Case: టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ కేసు.. రంగంలోకి ఈడీ

హైదరాబాద్‌ రామంతాపూర్ ఘోరం చోటుచేసుకుంది. డబ్బులు ఇవ్వలేదని తండ్రిని కిరాతకంగా చంపాడు కసాయి కొడుకు. రామంతపూర్ వివేక్ నగర్ కి చెందిన పాండు సాగర్ కి గత ముపై సంవత్సరాల క్రితం వివాహమైంది. పవన్, సాయి ప్రశాంత్, యశ్వంత్ అనే ముగ్గురు కుమారులు ఉన్నారు. రామంతపూర్ లో టెంట్ హౌస్ నిర్వహిస్తుంటాడు పాండు సాగర్. అయితే వారిద్దరి మధ్య ఏం జరిగిందో తెలియదు కానీ.. పాండు సాగర్‌ నాలుగు సంవత్సరాల క్రితం పీర్జాధిగూడకి చెందిన విజయ లక్ష్మిని రెండోవ వివాహం చేసుకున్నాడు. ఇప్పుడు ప్రస్తుతం రెండో భార్య విజయ లక్ష్మి తోనే ఉంటున్నాడు. మొదటి భార్య వద్ద వెళ్లకుండా రెండో భార్య వద్దనే ఉండి జీవనం కొనసాగిస్తున్నారు.

అయితే.. టెంట్ హౌస్ సామానును పెట్టడానికి శ్రీనివాసపురంలో ఒక అపార్ట్మెంట్ లో రెంటు తీసుకున్నాడు. ఆ అపార్ట్ మెంట్ వద్దకి మొదటి భార్య కుమారుడు పవన్‌ అక్కడకు వచ్చాడు. డబ్బులు అవసరమని కవాలని గొడవకు దొగాడు. అయితే తండ్రి తన వద్ద ఒక్కరూపాయి కూడా లేదని, ఒక వేళ వున్నా నీకు ఇచ్చే ప్రసక్తే లేదని తెగేసి చెప్పాడు. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన కొడుకు పవన్‌ తండ్రిపై దాడికి దిగాడు. టెంట్ హౌజ్ నుండి తెచ్చిన సుత్తితో తండ్రి తలపై అతి దారుణంగా కొట్టి హత్య చేసాడు. పాండు సాగర్ అక్కడే కుప్పకూలిపోయాడు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో హుటా హుటిన చేరుకున్న పోలీసులు పవన్‌ ను అదుపులో తీసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Nirmala Sitharaman: భారత్ లో ముస్లింల జనాభా అధికం.. పాకిస్థాన్ కంటే మనమే టాప్

Exit mobile version