Butcher Son: నవమాసాలు మోసి కని పెంచి కంటికి రెప్పలా కాపాడుకుని 9 నెలలు కన్న బిడ్డ బరువును మోసి తనకు ప్రపంచాన్ని చూపే ఆతల్లికి కోటి దండాలనే చెప్పాలి. కడుపులో వున్నప్పుడు బరువు నెల నెల పెరుగుతున్న అది తీయ్యని కష్టంగానే భావించి ఆస్వాదిస్తూ తన నలుసు బయటకు వచ్చినప్పటి నుంచి ఎంత కష్టం వచ్చినా అది భరిస్తూ.. తన కడుపును మాడ్చుకుని కన్న బిడ్డ కడుపు నిండితే చాలని అనుకుంటుంది తల్లి. తన బుల్లి బుల్లి మాటలకు మంత్రముగ్దులై వారు ఏంచెప్పినా నవ్వుతూ ఆడిస్తూ పెంచుకుంటూ వస్తుంది. తీరా పెద్దయ్యాక కడుపులో పెట్టుకుని పెంచిన తల్లిని కడతేర్చడానికి పూనుకుంటున్నారు బిడ్డలు. దానికి గల కారణం డబ్బు. వ్యసనాలు, కష్టపడాలంటే చాతకాని తనం, డబ్బులు విచ్ఛలవిడిగా ఖర్చుపెట్టి దాగి తందనాలు ఆడటానికి వారికి కావాల్సింది డబ్బు మాత్రమే. దానిముందు కన్న తల్లి అయినా కుటుంబ సభ్యులైనా వారి కంటిముందు కనపడరు. డబ్బుతీసుకోవడానికి, వారి పై వున్న ఆస్తిని తీసుకునేందుకు కుటుంబ సభ్యులపైనే దాడులకు పాల్పడుతుంటారు. ఇలాంటి ఘటనే మహబూబ్‌నగర్ జిల్లాలో చోటుచేసుకుంది.
Read also: Harish Rao: ప్రముఖులు అంతా RBVRR హాస్టల్లో ఉన్నవారే..!
మహబూబ్ నగర్ జిల్లా భూత్పూరు మండలం మద్దిగట్లలో దారుణం చోటుచేసుకుంది. తల్లి బీరమ్మతో పాటు తన కొడుకు వీరప్ప నివాసం ఉంటున్నారు. కొడుకు వ్యసనానికి బానిసై రోజూ డబ్బులకోసం తల్లి బీరమ్మను వేధించేవారు. చివరకు ఆస్తిమీద వీరప్పకు కన్ను పడింది. ఆస్తికోసం తల్లి బీరమ్మతో గొడవకు దిగాడు. దీంతో ఆస్తి రాసివ్వనని బీరమ్మ చెప్పడంతో ఆగ్రహంతో ఊగిపోయిన వీరప్ప ఆమెను చంపేందుకు ప్లాన్ వేశాడు. ఆమెను చంపితే తనపేరు మీద వున్న ఆస్తిమొత్తం అతనికి వస్తుందని ఆశపడ్డాడు. ఇంట్లో వున్న రోకలిబండతో అతి కిరాతకంగా కొట్టాడు. తీవ్రంగా గాయపడ్డ బీరమ్మ అక్కడికక్కడే మృతిచెందింది. అయితే మృతదేహాన్ని ఏం చేయాలనేది కాసేపు సమాలోచనలో పడ్డాడు వీరప్ప చివరికి ఒక ప్లాన్ వేశాడు. మృతదేహాన్ని కూర్చీలో కూర్చోబెట్టాడు. దొంగలు ఇంటికి దోచుకునేందుకు వచ్చారని వాళ్లని అడ్డుకునే ప్రయత్నంలో బీరమ్మను దొంగలే హత్యచేసినట్లు చిత్రీకరించేందుకు ప్రయత్నించాడు. అయితే ఇరుగుపొరుగు వారు పోలీసులు సమచారం సేకరించాగా నిర్ఘాంత పోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. తల్లిని రోకలిబండతో చంపింది కొడుకు వీరప్పనే అని నిజాన్ని బయటపెట్టారు పోలీసులు. దీంతో చేసేది ఏమీలేక కోడు వీరప్ప కూడా తన నేరాన్ని అంగీకరించాడు. ఆస్తికోసమే తల్లిని చంపినట్టు పోలీసులముందు నేరాన్ని అంగీకరించాడు.
KTR: సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం అద్భుతంగా అభివృద్ధి