NTV Telugu Site icon

Banjara Hills: దారుణం.. యువతిని బంధించి సెక్యూరిటీ గార్డ్‌ అత్యాచారం

Banjara Hills

Banjara Hills

నగరంలో జూబ్లీహిల్స్‌ లో సామూహిక అత్యాచారం సంచలనం రేపిన విషయం తెలిసిందే. ఇంకా ఆఘటన ప్రజలు మరువకముందే అలాంటి ఘటనే బంజారాహిల్స్‌లో చోటు చేసుకోవడం సంచలనంగా మారింది. ఓ సెక్యూరిటీ గార్డ్‌ ఓ.. యువతిని గదిలో బంధించి ఆమెపై అత్యాచారానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

read also: Lovers Arrest: ప్రియురాలి కోసం అన్న దొంగతనం.. తర్వాతేమైంది?

వివరాల్లో వెళితే.. బంజారాహిల్స్‌లోని ఓ బస్తీకి చెందిన యువతికి, అదే ప్రాంతంలో సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్న చిన్మయి సైక్యాతో పరిచయం ఏర్పడింది. ఇదే అలుసుగా తీసుకున్న సెక్యూరిటీ గార్డు యువతి పై కన్నేసాడు. ఈ నెల 4న (గురువారం) ఆమె ఇంట్లో ఎవరూ లేని సమయంలో గదిలో బంధించి అత్యాచారానికి పాల్పడ్డాడు. తనపై బయటకు చెబితే చంపుతానంటూ బెదిరించాడు. అయితే దారుణఘటనపై జీర్ణించుకోలేక బాధితురాలు మరుసటి రోజు తనకు చనిపోవాలని ఉందంటూ స్నేహితురాలికి చరవాణిలో సంక్షిప్త సందేశం పంపడంతో స్నేహితురాలు షాక్‌ కు గురైంది. స్నేహితురాలు వెంటనే ఆమె బాధితురాలి సోదరికి చెప్పటంతో ఈ దారుణ మైన ఘటన బయటపడింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు బంజారాహిల్స్‌ సీఐ ఎం.నరేందర్‌ తెలిపారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం.
COVID 19 Update: స్వల్పంగా తగ్గిన కరోనా కేసులు.. ఇవాళ ఎన్నంటే..?

Show comments